Nuh Violence: ఐపీఎస్ మ‌మ‌తా సింగ్.. ఆమె వీర‌త్వం వేలాది మంది ప్రాణాల‌ను కాపాడింది.. !

By Mahesh Rajamoni  |  First Published Aug 8, 2023, 3:52 PM IST

Nuh Violence: బ్రిజ్ మండల్ యాత్ర సంద‌ర్భంగా చెల‌రేగిన హింసాత్మకమైన నుహ్‌లో నల్లహాడ్ ఆలయంలో చిక్కుకున్న 1,000 మంది మహిళలు, పిల్లలతో సహా 2,500 మందిని రక్షించడంలో హర్యానా అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) మమతా సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఆమె స‌మ‌యానికి త‌గ్గ వేగవంతమైన ఆలోచ‌న‌, శీఘ్ర-ధైర్యమైన పనిని కొనియాడింది. 
 


Presidential awardee Mamta Singh: బ్రిజ్ మండల్ యాత్ర సంద‌ర్భంగా చెల‌రేగిన హింసాత్మకమైన నుహ్‌లో నల్లహాడ్ ఆలయంలో చిక్కుకున్న 1,000 మంది మహిళలు, పిల్లలతో సహా 2,500 మందిని రక్షించడంలో హర్యానా అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) మమతా సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఆమె స‌మ‌యానికి త‌గ్గ ఆలోచ‌న‌, శీఘ్ర-ధైర్యమైన పనిని కొనియాడింది. అయితే, తీవ్ర రూపంలో చెల‌రేగిన ఈ హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల నుంచి  చాలా మందిని ర‌క్షించ‌డం గురించి రాష్ట్రప‌తి ఆవార్డు గ్ర‌హీత అయిన‌ మ‌మ‌తా సింగ్ వివ‌రిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను గురించి చెప్పారు. నూహ్ జిల్లాలో ఇటీవల అశాంతి నెలకొన్న సమయంలో నూహ్ ఘర్షణల గురించి హెడ్ క్వార్టర్స్ నుంచి తనకు సందేశం వచ్చిందనీ, వెంటనే శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించడానికి నుహ్ వైపు వెళ్లానని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు.

"నేను ఐఆర్బీ (IRB) భోండ్సీలో ఉన్నాను, కాబట్టి నేను ప‌లువురితో కూడిన భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను తీసుకొని నుహ్ వైపు వెళ్ళాను. మేము నూహ్ చేరుకునేసరికి, అనేక వాహనాలు తగలబడి కాలిపోతున్నాయి. అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. అక్బర్ చౌక్, త్రింగా చౌక్, బద్కాలీ చౌక్ అనే మూడు ప్రధాన చౌక్ లలో అల్లరిమూకలు గుమిగూడి పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఎలాగోలా వారు ఈ కీలక పాయింట్లను దాటి నల్లహాడ్ ఆలయానికి చేరుకున్నారని" తెలిపారు. అనంత‌రం మమతా సింగ్ నిర్భయంగా పోలీసు దళాన్ని నడిపించి భారీ ఘర్షణల తర్వాత నల్లహాడ్ ఆలయంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలను విజయవంతంగా రక్షించారు.

Latest Videos

undefined

గతంలో ఆమె రేవారీలో విధులు నిర్వహించారనీ, నూహ్ లో జరిగిన హింసను ప‌లు ప్రాంతాల్లో పరిష్కరించారని, అయితే ఈ ఘర్షణ చాలా పెద్దదని ఏడీజీపీ తెలిపారు. దుండగులు ఆయుధాలను ప‌ట్టుకుని ఎత్తైన ప్రదేశంలో ఉన్నారని, పోలీసులపై, అందులో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసుల వాహనాలు, బస్సులు, వ్యక్తిగత వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. ఆలయం లోపల ఉన్న వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింద‌ని తెలిపారు. ఆయా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి ప్లాన్ మార్చుకుని తాము చిన్న సమూహాలను తయారు చేసామ‌నీ, మొదట మహిళలు-పిల్లలు ర‌క్షించ‌డానికి వారిని పోలీసు బస్సులు-ఇతర వాహనాలలో తరలించామని చెప్పారు. "దుండగులు ప్రాథమికంగా ఒక సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై కాల్పులు జరిపారు, అయితే పోలీసు బృందం ఏకే -47లు, ఇతర ఆయుధాలతో స‌రైన రీతిలో స్పందించింది. ఆలయం నుండి ప్రజలను విజయవంతంగా రక్షించగలిగింది. వారిని నుహ్ పోలీస్ లైన్స్ కు తరలించింది, అక్కడి నుండి వారిని బృందాలుగా గురుగ్రామ్ కు పంపారు" అని ఆమె చెప్పారు.

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే పేరు మమతా సింగ్ కు ఉంది. ప్రజలను రక్షించేందుకు ఆమె చేపట్టిన వేగ‌వంత‌మైన చ‌ర్య‌ల‌తో పాటు నూహ్ లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రేవారీ ఏడీజీపీ ఎం.రవికిరణ్ తో కలిసి మంగళవారం అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాలను సందర్శించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఆందోళనకారుల దాడికి గురైన సైబర్ క్రైమ్ నుహ్ పోలీస్ స్టేషన్ ను కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి సందర్శించారు. అక్కడ ఆమె సైబర్ క్రైమ్ ఎస్హెచ్ఓను కలుసుకోవ‌డంతో పాటు అల్లర్ల బాధితులను కూడా క‌లిసి ప‌రామ‌ర్శించి.. సంబంధిత వివ‌రాలు తెలుసుకున్నారు. బాధితులు తమ నష్టాల గురించి అధికారికి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మమతా సింగ్ బాధితులకు హామీ ఇచ్చారు. అయితే, మ‌మ‌తా సింగ్ అసాధారణ పోలీసు సేవలను గుర్తించి, 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన ఆమెకు 2022 లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డును ప్రదానం చేశారు.

(ఆవాజ్ ది వాయిస్ సౌజ‌న్యంతో..) 

click me!