ఛీఛీ.. ఇదేం పని? పనిమనిషిని పెట్టుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి

Published : Aug 25, 2025, 10:20 AM IST
ఛీఛీ.. ఇదేం పని? పనిమనిషిని పెట్టుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి

సారాంశం

ధనికులు, వృద్ధులు ఇంటి పనుల కోసం పనిమనిషిని పెట్టుకుంటారు. కొందరు చక్కగా పనులు చేస్తారు. కానీ కొందర్ మెయిడ్స్ మాత్రం చాలా విచిత్రంగా, అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి పనిమనిషే ఈవిడ కూడా.

ఇంట్లో ఎంతో మందికి పనిమనుషులు పెట్టుకునే పరిస్థితి. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు, ధనికులు, వృద్ధులు అధికంగా పనిమనుషులను పెట్టుకుంటారు. చాలా మంది మెయిడ్స్ చక్కగా పనిచేసి వెళతారు. కానీ కొందరు మాత్రం అసహ్యంగా ప్రవర్తిస్తారు. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే మెయిడ్ చాలా అసహ్యకరమైన పనిచేసింది. ఆ విషయం సీసీకెమెరాలో రికార్డు అవ్వడంతో అసలు సంగతి బయటపడింది. ఆ మెయిడ్  వంటగదిలోని పాత్రలపై మూత్రం పోసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పనిమనిషిని పెట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు. 

కెమెరా పెట్టడంతో బయటపడింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో  ఈ ఘటన జరిగింది.  సమంత్ర అనే మెయిడ్ పది సంవత్సరాలుగా ఆ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తోంది. ఆమె కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తించడం ఆ ఇంటి సభ్యులు గమనించారు. ఆమె సంగతి ఏంటో తెలుసుకునేందుకు కిచెన్ కెమెరా పెట్టారు. కానీ ఆ విషయం పనిమనిషికి తెలియదు.  ఆ కెమెరాలో ఆమె గ్లాసులో మూత్రం పోసి ఆ మూత్రాన్ని సింక్ లో ఉన్న గిన్నెలపై చల్లడం వంటి పనులు చేసింది. ఆ వీడియో చూసి ఆ ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయారు. 

జైలుకు పంపారు

ఆమె చేసిన పని తెలిశాక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది సంవత్సరాలుగా పనిచేస్తున్న సమంత్రపై వారికి ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఆమె ప్రవర్తన మారింది. పోలీసులు సమంత్రను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు.

గత సంవత్సరం గాజియాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక కుటుంబంలో వాళ్ళు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. అనుమానంతో కిచెన్ లో కెమెరా పెట్టారు. మెయిడ్ ఆహారంలో మూత్రం కలుపుతున్నట్లు వీడియోలో బయటపడింది. ఆ ఘటనలో కూడా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలాంటి ఘటనలు బయటపడుతున్న కొద్దీ పనిమనిషుల విషయంలో ప్రతి ఒక్కరూ భయపడాల్సి వస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !