సీఎంలపై క్రిమినల్ కేసులు, లేని కూతురి కోసం ఫిర్యాదు, కన్ను గీటితే పని పూర్తి.. ఈ వారం ఇంట్రెస్టింగ్ వార్తలు ఇదిగో

Published : Aug 24, 2025, 07:30 AM IST
Interesting news

సారాంశం

ప్రతివారం కొన్ని వార్తలు అనుకోకుండా మన చూపు నుంచి మిస్ అయిపోతాయి. మీరు కూడా ఇక్కడ ఇచ్చిన వార్తలు మిస్సయ్యే అవకాశం ఉంది. ఇక్క ఈ వారం జరిగిన ఆసక్తికరమైన వార్తలను ఇచ్చాము. 

ఈవారం కొన్ని ప్రముఖ వార్తలను ఇక్కడ ఇచ్చాము. వీటిని చదవకపోతే ఒకసారి చదివేయండి. ఇవి ఆసక్తికరమైనవే కాదు కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవి కూడా.

నాకు కన్ను గీటితే చాలు

మార్కండేయ ఖట్జూ భారతదేశంలోని ఉన్నతమైన సుప్రీంకోర్టుకు ఒకప్పుడు న్యాయమూర్తిగా వ్యవహరించారు. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంతో బాధ్యతయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే మార్కండేయ ఖట్జూ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అందులో ‘కోర్టులో నన్ను చూసి కన్ను గీటిన మహిళ న్యాయవాదులందరికీ అనుకూలమైన ఆదేశాలు వచ్చాయి’ అని రాసుకొచ్చారు. అంత పెద్ద వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేయడం మహిళా న్యాయవాదులకే కాదు ఎంతోమందికి కోపాన్ని తెప్పించింది. అతని ప్రవర్తన ప్రమాణాలకు తగ్గట్టు లేదని వ్యాఖ్యలు వచ్చాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఒక న్యాయమూర్తికి జీవితాంతం ఆ పదవి బాధ్యతను మోయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మహిళా న్యాయవాదులను కన్ను గీటతో తీర్పులను వక్రీకరించవచ్చని సూచించినట్టు ట్వీట్ పెట్టడం ఏమాత్రం సమంజసంగా లేదు. దీనిపై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఖట్జూ క్షమాపణలు చెప్పారు. అది కేవలం ఒక జోక్ అని చెప్పుకొచ్చారు.

అసలు నాకు కూతురే లేదు

ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు బృందం 17 చోట్ల తవ్వకాలు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సుజాత భట్ అనే వ్యక్తి కూడా తన కూతురు అనన్య భట్ కనిపించకుండా పోయిందని 2003లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు కూడా ఆమె కూతురు కనిపించలేదని మళ్లీ మీడియా ముందు చెప్పింది. కొన్ని రోజులపాటు అలాగే చెప్పి ధర్మస్థలకు వచ్చింది. రెండు రోజుల క్రితం మాత్రం తనకు ఆ పేరుతో కుమార్తె లేదని 2003లో కొంతమంది తనను ఒత్తిడి చేయడంతో కూతురు కనిపించకుండా పోయిందని చెబుతూ తప్పుడు ఫిర్యాదు చేశానని సుజాత మీడియాకు తెలిపింది. తను ఆస్తి కేసులో బాధితురాలుగా ఉన్నానని అందుకే తప్పుడు ఆరోపణలు చేసి తన కుమార్తె కనిపించడం లేదని చెప్పానని తెలిపింది. ఇలా ఆమె చెప్పిన మరుసటిరోజే ముసుగు వ్యక్తి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు కూడా దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పడంతోపాటు అనేక రకాల అభియోగాలు ఆయనపై మోపింది. అతడు ఎవరి ఒత్తిడితో అన్ని అబద్ధాలు చెప్పాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియలు జరిగిన దాఖలాలు కనిపించలేదు.

ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు

మనదేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను... అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ నివేదిక విశ్లేషించింది. మనదేశంలో ప్రస్తుతం పది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న వారిలో నలుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది. 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఇచ్చిన స్వీయ నివేదికలలో 12 మంది ముఖ్యమంత్రులు ప్రస్తుతం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, పదిమంది హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారని ఈ నివేదిక చెబుతోంది. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనపై 89 కేసులు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 47 కేసులతో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై 19 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై 13 కేసులు ఉన్నట్టు నివేదిక చెబుతోంది.

అన్ని రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ ను గుర్తించండి

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ అధికంగా వస్తోంది. ప్రతి గంటకు ఐదుగురు భారతీయులు నోటి క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని పార్లమెంటరీ ప్యానెల్ చెప్పింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్యాన్సర్ ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించాలని కోరింది. నోటిఫైబుల్ గా ప్రకటించడం వల్ల క్యాన్సర్ గురించి ప్రతి ఏటా డేటాలు, నివేదికలు లభిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ ను ఏ స్థాయిలో పెరుగుతుందో, దాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవచ్చని పార్లమెంటరీ ప్యానెల్ చెబుతోంది. క్యాన్సర్ కు కారణం అవుతున్న పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నులు విధించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. అలా వచ్చిన ఆదాయాన్ని దేశవ్యాప్తంగా కాన్సర్ పరిశోధనకు క్యాన్సర్ ప్రోగ్రాం సంరక్షణకు ఉపయోగించాలని కోరింది.

అత్యంత బరువైన రాకెట్ ఇదిగో

ఇస్రో ప్రతి ఏడాది అంతరిక్షంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. తన సొంత ప్రయోగ వాహనాలను విజయవంతంగా ప్రయోగిస్తూనే ఉంది. ఇప్పటికే PSLV, LSLV వంటి శక్తివంతమైన సమర్థవంతమైన రాకెట్లను తయారు చేసింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ అత్యంత బరువైన రాకెట్ ను నిర్మించే పనిలో ఉందని చెప్పారు. దానికి లూనార్ మార్జిన్ లాంచ్ వెహికల్ అని పేరు పెట్టినట్టు వివరించారు. 2035 నాటికి ఈ వెహికల్ సిద్ధంగా ఉంటుందని... 2040 నాటికి చంద్రుడి పైకి మానవ సహిత యాత్రను ఇస్రో ప్రారంభిస్తుందని ఆయన వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Celebrates Christmas at Cathedral Church: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ | Asianet News Telugu
ఇంట్లో ఎంత ఆల్క‌హాల్ ఉండొచ్చు.? న్యూ ఇయ‌ర్ దావ‌త్ వేళ ఈ విష‌యాలు క‌చ్చితంగా తెలుసుకోండి