
లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అదృశ్యమైన కొద్ది గంటల్లోనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు చనిపోయి కన్పించారు. వీరిలో ఒకరి మృతదేహం చెట్టుకు ఉరేసుకొని ఉంది.
ఈ ఘటన రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లాలో చోటు చేసుకొంది. రాష్ట్ర రాజధాని లక్నోకు 270 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
చనిపోయిన అక్కా చెల్లెళ్ల కుటుంబం ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. పనిచేసే చోటునే ఆ కుటుంబం నివసిస్తోంది.
చనిపోయిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు 20 ఏళ్లలోపు ఉంటుంది. ఒకరి వయస్సు 18 ఏళ్లు, మరొకరి వయస్సు 20 ఏళ్లు.సోమవారం నాడు సాయంత్రం నుండి వీరిద్దరూ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎంతకూ కూడ వారు ఇంటికి తిరిగి రాలేదు.
రెండు మృతదేహాలపై గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. అయితే మృతులపై లైంగిక దాడి జరిగినట్టుగా నిర్ధారించలేదని పోలీసులు ప్రకటించారు.
సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు వీరిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఎంతకు తిరిగి రాలేదు. వారి కోసం కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
ఇద్దరు అక్కా చెల్లెళ్ల కోసం గాలించిన కుటుంబసభ్యులకు ఒకరి మృతదేహం కన్పించింది. ఇవాళ ఉదయం మరొకరి మృతదేహం చెట్టుకు ఉరేసుకొన్నట్టుగా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.