45 ఏళ్లు దాటిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు: కేంద్రం

By narsimha lodeFirst Published Mar 23, 2021, 4:08 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.ఈ ఏడాది ఏప్రిల్ `1 నుండి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడ కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.
 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.ఈ ఏడాది ఏప్రిల్ `1 నుండి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడ కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

మంగళవారం నాడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రకటించారు.కరోనా వైరస్ వ్యాక్సిన్లతో టీకాలు వేయడానికి తమను తాము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జవదేకర్ కోరారు.దేశంలో కరోనా వ్యాక్సిన్ మోతాదుల కొరత లేదని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.దేశంలో వ్యాక్సిన్ నిల్వలున్నాయని ఆయన చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ  టీకాలు వేయించుకోవాలని కోరారు.

పంజాబ్ లో యూకే కరోనా వేరియంట్ కేసులు వ్యాఖ్యానించాలని కోరితే  తాను ఆరోగ్య నిపుణుడిని కాదన్నారు. అయితే ఈ వైరస్ అనేక రకాల్లో విస్పోటనం చెందుతుందని జవదేకర్ చెప్పారు.శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తల సలహా ప్రకారంగా రెండవ మోతాదు నాలుగు నుండి ఎనిమిది వారాల మధ్య కోవిషీల్డ్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
 

click me!