యూపీలో పరువుహత్య... మామిడితోటలో ప్రేమజంట మృతదేహాలు

Published : May 12, 2023, 10:23 AM IST
యూపీలో పరువుహత్య... మామిడితోటలో ప్రేమజంట మృతదేహాలు

సారాంశం

దళిత యువకుడు, అగ్రకుల యువతి ప్రేమించుకున్నారని ఇద్దరినీ అతి దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఉన్నావ్ : ఈ టెక్నాలజీ యుగంలోనూ పరువుహత్యలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. అగ్రకులానికి చెందిన యువతి, దళిత యువకుడు ప్రేమించుకున్నారని వారిద్దరినీ అతి కిరాతకంగా చంపారు. యువతి తండ్రితో పాటు బంధువులు వీరిద్దరిని అతి దారుణంగా హత్యచేసారు. అనంతరం ఓ చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. 

యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ అగ్రకుల మైనర్ యువతి దళిత యువకున్ని ప్రేమించింది. వీరి ప్రేమగురించి తెలిసి యువతి కుటుంబసభ్యులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ముందు తమ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిని పట్టుకుని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడిని దారుణంగా కొట్టిచంపారు. అనంతరం యువతిని కూడా అక్కడికి తీసుకువచ్చి అలాగే చంపేసారు. 

ఇలా ప్రేమజంటను హతమార్చి మృతదేహాలను ఓ చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. విషయం తెలిసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో వారిది ఆత్మహత్య కాదు హత్యగా తేలింది. దీంతో బాలిక కుటుంబసభ్యులే వీరిని చంపేసినట్లు గుర్తించిన పోలీసులు. దీంతో యువతి తండ్రితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసారు. 

Read More  దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రేమజంటను హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు యూపీ ప్రభుత్వాన్ని కోరారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..