హిట్లర్ గొప్పోడు.. ఇజ్రాయెలీ దౌత్య అధికారికి ఆన్‌లైన్‌లో విద్వేషం.. ది కశ్మీర్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో కామెంట్

By Mahesh KFirst Published Dec 3, 2022, 4:21 PM IST
Highlights

హిట్టర్ గొప్పోడు.. అంటూ ఇజ్రాయెలీ దౌత్య అధికారి నార్ గిలన్‌కు ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత మెస్సేజీలు వచ్చాయి. వాటిని ఆయన స్క్రీన్ షాట్ తీసి పోస్టు చేశారు. దానికి భారతీయుల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభించింది.
 

న్యూఢిల్లీ: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను విమర్శించిన ఫిలిం మేకర్, ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్‌ను ఖండించిన ఇజ్రాయెలీ దౌత్య అధికారి నార్ గిలన్ ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా, నార్ గిలన్ ఆన్‌లైన్‌లో తీవ్ర విద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన మచ్చుకు ఒక స్క్రీన్ షాట్ పోస్టు చేశాడు. అది చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. ఆ పోస్టులో హిట్లర్‌ను స్తుతిస్తూ ఉన్నది. 

గిలన్ శుక్రవారం తనకు ట్విట్టర్‌లో వచ్చిన ఓ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్టు చేశాడు. అందులో ఇలా ఉన్నది. హిట్లర్ గొప్పోడు. నీలాంటి మూర్ఖులను చంపేసినప్పుడు ఆయన గ్రేట్. వెంటనే నువ్వు ఇండియా నుంచి వెళ్లిపో. హిట్లర్ గొప్ప వ్యక్తి’ అని ఆ స్క్రీన్ షాట్‌లో ఉన్నది. 

‘ఈ కోణంలో తనకు వచ్చిన కొన్ని డీఎంలను షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ప్రొఫైల్ ప్రకారం, అతనికి పీఎహెచ్‌డీ ఉన్నది. కానీ, అతన్ని గుర్తించే వివరాలను తాను డిలీట్ చేశా’ అని వివరించారు. 

Also Read: సారీ.. కానీ, నా వ్యాఖ్యలు సుస్పష్టం.. ఆ సినిమా అలాంటిదే: ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లాపిడ్

ఈ మెస్సేజీ పోస్టు చేసిన తర్వాత అతనికి భారతీయుల నుంచి అపరిమితమైన మద్దతు లభించింది. మరో ట్వీట్‌లో ఆయన అందిరకీ కృతజ్ఞతలు తెలిపారు. 

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక ప్రాపగాండ, వల్గర్ ఫిలిం అని నడవ్ లాపిడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో నడవ్ లాపిడ్ పేర్కొన్నారు. దీంతో సినీ ప్రముఖల నుంచి మొదలు రాజకీయ నేతల వరకు ఆయన వ్యాఖ్యలపై అసంతృప్తి వచ్చింది. ఈ నేపథ్యంలో నార్ గిలన్ ఆ ఇజ్రాయెలీ  ఫిలిం మేకర్‌ను తప్పుపట్టారు. ఇలాంటి చరిత్రాత్మక ఘటనలపై సమగ్ర అధ్యయనం చేయనిదే నోరుపారేసుకోవద్దని సూచించారు. 

click me!