పండుగపూట గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు వెలుగు చూశాయి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు అతివేగంగా నడుపుతూ.. రోడ్డుపై ఉన్నవారిని భయాంభంత్రులకు గురి చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరాల సాయంతో రెండు కేసుల్లోని వాహనాలను గుర్తించిన పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కేసు గాలింపు చేపట్టారు.
దీపావళి పండుగ పూట గ్రేటర్ నోయిడాలో హృదయ విదారకమైన ఘటనలు వెలుగు చూశాయి. ఆదివారం రాత్రి గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో రెండు హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. మొదటి ఘటన నోయిడాలోని సెక్టార్ 119 లోని గత రాత్రి ఆల్డికో ఇన్విటేషన్ సొసైటీ లో గేట్ నంబర్ 2 వద్ద నమోదైంది. ఆల్డికో ఇన్విటేషన్ సొసైటీ వెలుపల కొందరూ బాణాసంచా కాల్చే సమయంలో ఓ కారు డ్రైవర్ బీభత్సం స్రుష్టించారు.
అతివేగంగా వెళ్తూ.. రోడ్డుపై ఉన్నవారిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో సమీపంలోని సీసీటీవీని పరిశీలించి వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
undefined
రెండో ఘటన బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీ 2 సమీపంలో చోటుచేసుకుంది. దీపావళి రోజు రాత్రి గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ సిటీ 7 అవెన్యూ సమీపంలో SUV డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం స్రుష్టించారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డు పైకి కారు దూసుకు రాగా.. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు తృటిలో తప్పించుకున్నాడు. కానీ ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి కాలు విరిగినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో నిందితుడైన కారు డ్రైవర్‌ను బిస్రాఖ్ పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు డ్రైవర్‌ను సెక్టార్ 119 ఎల్డిగో ఇన్విటేషన్ సొసైటీ నివాసి సిద్ధార్థ్‌గా గుర్తించారు. ఆ డ్రైవర్ కారును అతివేగంగా నడుపుతూ చాలా మందిని గాయపరిచినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ADCP నోయిడా శక్తి అవస్థి మాట్లాడుతూ.. సెక్టార్ 113, సెక్టర్ 119 పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తర్వాత గాయపడిన ముగ్గురినీ కైలాష్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.