ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

By Asianet News  |  First Published Nov 13, 2023, 1:42 PM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు మరణించారు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఈరోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. 


ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అందులో ఉన్ననలుగురు చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఆ వ్యక్తిని స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 

gang-rape : దారుణం.. యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం..

Latest Videos

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లా పూడూర్ ప్రాంతానికి చెందిన కీర్తివరాయ్ (28), పూవరసన్ (24), రాఘవన్ (26), మేలందన్ (30)తో మరో వ్యక్తి కలిసి కారులో ఏలూరు నుంచి సత్యమంగళం వెళ్తున్నారు. ఈ కారు నేటి తెల్లవారుజామున ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కీర్తివరాయ్, పూవరసన్, రాఘవన్, మేలందన్ అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆయనను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను వెలికితీసి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Ashok Gehlot : ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ హంతకులకు బీజేపీతో లింకులు - అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు..

ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని బుండి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా జిల్లాలోని గంగుఖేడి గ్రామానికి చెందిన దేవీ సింగ్ (50), అతడి భార్య మాన్ఖోర్ కన్వర్ (45), అతడి సోదరుడు రాజారామ్ (40), మేనల్లుడు జితేంద్ర (20) ఓ కారులో రాజస్థాన్ లోని పుష్కర్ కు బయలుదేరింది. ఆ కారు నేషనల్ హైవే నెంబర్ 52పై ప్రయాణిస్తూ ఆదివారం తెలవారుజామున బుండి జిల్లాలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేరుకుంది.

జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్ హతం.. కరాచీలో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు..

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తోంది. ఈ కారు ముందు ఓ ట్రక్కు కూడా వెళ్తోంది. అయితే ఆకస్మాత్తుగా ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడంతో వెనకాల ఉన్న కారు దానిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించంతో ఆమె మరణించింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ ను దాని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

click me!