ప్రియురాలి పెళ్లి ఆపేందుకు సొంత కిడ్నాప్, హత్య డ్రామా.. వీడియో వైరల్ కావడంతో....

Published : Apr 27, 2023, 04:11 PM IST
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు సొంత కిడ్నాప్, హత్య డ్రామా.. వీడియో వైరల్ కావడంతో....

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో తన ప్రియురాలి పెళ్లిని ఆపేందుకు ఓ వ్యక్తి తన సొంత కిడ్నాప్, హత్య డ్రామాకు తెరతీశాడు. ఇది ఫేక్ అని తెలియడంతో అరెస్టై జైలుపాలయ్యాడు.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన ప్రియురాలి పెళ్లిని ఆపడానికి తాను కిడ్నాప్ అయినట్టు, కిడ్నాపర్లు తనను హత్య చేసినట్టు వీడియో సృష్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు వ్యక్తి చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి ఉన్నాయి. ముఖంపై రక్తం మరకలు, నాలుక బయటకు వచ్చినట్లుగా వీడియోలో కనిపిస్తుంది.

దీంతో ఈ వీడియోలో ఉన్న వసీం అనే వ్యక్తి కోసం పోలీసు బృందం గాలింపు చేపట్టి.. అతని సోదరి ఇంట్లో అతన్ని కనుగొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలోని షాబాజ్‌పూర్ కాలా గ్రామంలో జరిగింది. దీని వివరాల్లోకి వెడితే.. వసీం తన గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో అక్రమ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, ఆ విషయం ఇరువురి కుటుంబాలకు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న వసీం తన ప్రియురాలి కుటుంబాన్ని ఇరికించేందుకు తనను తానే అపహరణ, హత్యలు చేసి పెళ్లిని ఆపేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఏప్రిల్ 23 సాయంత్రం వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. వసీం సోదరుడు అతని ‘మరణ’ వీడియోను అందుకున్నాడు.

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు జ్యుడీషీయల్ రిమాండ్ మే 12 వరకు పొడిగింపు

ఏప్రిల్ 23 సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిన వసీం, రాత్రి వరకు తిరిగి రాలేదు. వసీం తమ్ముడు షరీక్‌కి రాత్రిపూట ఒక వీడియో వచ్చింది. అందులో వసీం చేతులు, కాళ్లను తాడుతో కట్టి ఉన్నాయి. ముఖంపై రక్తం మరకలున్నాయి. నాలుక బయటకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అస్మోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలిక కుటుంబీకులే వసీమ్‌ను హత్య చేశారని ఆరోపించారు. ఆ వీడియోను పోలీసులకు కూడా చూపించారు.

అస్మోలీ పోలీసులు కొంతమంది యువకులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు, కానీ వాసిమ్‌పై ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆ తర్వాత పోలీసులు వసీం మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఏప్రిల్ 23 రాత్రి నుంచి ఏప్రిల్ 24 తెల్లవారుజాము వరకు వెతుకులాట కొనసాగినప్పటికీ అతడు ఆచూకీ లభించలేదు.

అప్పటికి పోలీసులకు అనుమానం వచ్చింది. వసీం తన సోదరి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. సోదరుడి మృతి గురించి కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పగా, వసీం తన వద్దే ఉన్నాడని ఆమె చెప్పింది. వెఆ తర్వాత వసీం బంధువులు అసమోలి పోలీస్ స్టేషన్‌లోని బృందంతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వసీంను అరెస్ట్ చేశారు.

విచారణలో వసీం తన ప్రియురాలి పెళ్లిని ఆపాలనుకున్నట్లు వెల్లడించాడు. అందువల్ల, అతను తన సొంత కిడ్నాప్, హత్య గురించి ఒక తప్పుడు స్టోరీ ప్లాన్ చేశాడు. వీడియో రికార్డు చేసిన వసీం స్నేహితుడు అనాస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu