ఆగ‌ని క‌రోనా ఉద్ధృతి.. కొత్త‌గా 26 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Apr 27, 2023, 4:06 PM IST
Highlights

New Delhi: భారత్ లో కొత్తగా 9,355 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 57,410కి చేరుకున్నాయి. ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ స్పందిస్తూ.. కోవిడ్-19కు కారణమైన వైరస్ ఇక్కడే ఉంది.. ఇదే స‌మ‌యంలో ప్రపంచం మహమ్మారి అత్యవసర దశ నుండి బయటపడటం ప్రారంభించిందని అన్నారు.
 

IndiaFightsCorona COVID-19: భార‌త్ లో కోవిడ్-19 వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. అయితే, ఈ వారంలో కొత్త కేసులు మళ్లీ పెరగడం.. ఆ త‌ర్వాత త‌గ్గ‌డం వంటి హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.  గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల చోటుచేసుకుంది. 9,355 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 26 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  5,31,424 కు పెరిగింది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,410కి తగ్గగా, మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇది 0.13 శాతంగా ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధ‌వారం సంఖ్య 61,013తో పోలిస్తే యాక్టివ్ కేసుల్లో దాదాపు 4,000 తగ్గుదల కనిపించింది. భారత్ లో ఏప్రిల్ 26న  9,629 కేసులు నమోదు కాగా, మంగళవారం (ఏప్రిల్ 25) దేశంలో 6,660 కేసులు నమోదయ్యాయి.ఏప్రిల్ 22న 12,193 కొత్త కేసులు, ఏప్రిల్ 24న 10,112 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం ఏప్రిల్ 25న‌ 7,178 కేసులు నమోదయ్యాయి.

గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 5.36 శాతంగా నమోదైంది. జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. కాగా, గత 24 గంటల్లో 21.16 శాతం పాజిటివిటీతో 1,040 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో అత్యధికంగా ఏడు మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి దేశ రాజధానిలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 20,36,196కు, మరణాల సంఖ్య 26,613కు పెరిగింది. దేశ రాజధానిలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,708గా ఉంది. 

ఒడిశాలో గత 24 గంటల్లో 542 కోవిడ్ -19 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్లో రెండోసారి ఒడిశాలో కోవిడ్ -19 కేసులు 500 మార్కును దాటాయి. గత ఆదివారం రాష్ట్రంలో 502 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,270కి చేరింది. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం అన్ని ఆరోగ్య సంస్థలు, ఎక్కువ మంది ఉండే ఇండోర్ ప‌ని ప్ర‌దేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.

click me!