హిందూ అనే పదం భారతదేశానిది కాదని, అది పర్షియన్ పదం అని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీష్ జార్కిహోళి అన్నారు. ఆ పదం ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిందని తెలిపారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
కర్ణాటక కాంగ్రెస్ నేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి సోమవారం పెద్ద వివాదాన్ని రేపారు. హిందూ అనే పదానికి భయంకరమైనది అని అర్థం అన్నారు. ఆ పదం భారతదేశానికి చెందినది కాదని, పర్షియా నుంచి వచ్చిందని చెప్పారు. బెళగావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పదం, మతం ‘బలవంతంగా ప్రజలపై రుద్దబడ్డాయి’ అని జార్కిహోళి అన్నారు. ‘ హిందూ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? అది పర్షియా నుండి వచ్చింది. అయితే భారతదేశంతో దాని సంబంధం ఏమిటి? 'హిందూ' మీది ఎలా అయ్యింది’ అని కాంగ్రెస్ ఆయన అన్నారు. ‘‘వికీపీడియాలో తనిఖీ చేయండి. ఈ పదం మీది కాదు. అది ఇరాన్, ఇరాక్ నుండి వచ్చింది. మీరు దానిని ఎందుకు పీఠంపై ఉంచాలనుకుంటున్నారు?... దాని అర్థం భయంకరమైనది. దీని అర్థం ఏమిటో అర్థం చేసుకుంటే మీరు సిగ్గుపడతారు. ’’ అని తెలిపారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బీజేపీ ఖండించింది. ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ‘ ఇది చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మెజారిటీని అవమానిస్తూనే ఉంది. ఇంతకు ముందు సిద్ధరామయ్య అదే చేసేవారు. ఇప్పుడు ఆయన అనుచరుడు, మాజీ మంత్రి సతీష్ జార్కిహోలి కూడా అదే చేస్తున్నారు’’ అని బీజేపీకి చెందిన ఎస్ ప్రకాష్ తెలిపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. జార్కోలీ ప్రకటనపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
| "Where has 'Hindu' term come from?It's come from Persia...So, what is its relation with India? How's 'Hindu' yours? Check on WhatsApp, Wikipedia, term isn't yours. Why do you want to put it on a pedestal?...Its meaning is horrible:KPCC Working Pres Satish Jarkiholi (6.11) pic.twitter.com/7AMaXEKyD9
— ANI (@ANI)అలాగే అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య కూడా జార్కిహోళిపై విరుచుకుపడ్డారు. హిందువులను అవమానించిన జార్కిహోళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ నాయకుడి నాలుక కోసిన వ్యక్తికి రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ఆచార్య ప్రకటించారు.
భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే.. మహారాష్ట్రలో ఎంటర్ కానున్న రాహుల్ గాంధీ
జార్కిహోళి వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా ఖండించడం గమనార్హం. ఇది దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘‘హిందూత్వం ఒక జీవన విధానం. నాగరికత వాస్తవికత. ప్రతీ మతం, విశ్వాసం, విశ్వాసాన్ని గౌరవించేలా కాంగ్రెస్ మన దేశాన్ని నిర్మించింది. ఇది భారతదేశ సారాంశం. సతీష్ జార్కిహోళి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరం. దానిని తిరస్కరించడానికి అర్హమైదని. మేము దానిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము.’’ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. జార్కిహోళి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ‘హిందూ’ పదంపై చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే కాంగ్రెస్ నేతల నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులలో ఒకరైన శివరాజ్ పాటిల్ కూడా ఇలాంటి వివాదాస్పద ప్రకటన ఒకటి చేశారు.
ఆయన ఆ ప్రకటన చేసిన సమయంలో ఆయన వెంటనే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. జిహాద్ అనేది ఖురాన్‌లోనే కాదని, గీతలో కూడా జిహాద్ ఉందని శివరాజ్ పాటిల్ అన్నారు. జీసస్‌లో కూడా జిహాద్ ఉందని చెప్పాడు. ఇస్లాం మతంలో జిహాద్‌పై చాలా చర్చ జరిగిందని పాటిల్ అన్నారు.