కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ,గణపతి ఫోటోలు ముద్రించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, గతంలో కేజ్రీవాల్ హిందూత్వ వ్యతిరేక ప్రకటనలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా బీజేపీ పోస్టు చేసింది.
న్యూఢిల్లీ:గుజరాత్ ఎన్నికల కోసం కరెన్సీ నోట్లపై లక్ష్మీ,గణపతి దేవతల బొమ్మలను ముద్రించాలని ఆప్ డిమాండ్ చేసిందని బీజేపీ విమర్శలు చేస్తుంది. దేవతలు,హిందూత్వంపై ఆప్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ బీజేపీ ట్విట్టర్ లో సెటైరికల్ వీడియోను పోస్టు చేసింది.
గతనెలలో ఆప్ చీఫ్,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణపతి ఫోటోలను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై అరవింద్ కేజ్రీవాల్ తీరుపై ఇతర పార్టీలు విమర్శలు గుప్పించాయి.. ఆప్ డిమాండ్ పై కాంగ్రెస్ మండిపడింది.కరెన్సీనోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించకుండా చూసుకోవాలని ప్రజలను కోరింది కాంగ్రెస్ .ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్ సీఎం కార్యాలయంలో కొన్నిప్రభుత్వకార్యాలయాల నుండి గాంధీ ఫోటోలను తొలగించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ నేతలు గుర్తు చేస్తున్నారు.
ये 'आप' ही का भूत है, पीछा नहीं छोड़ेगा! pic.twitter.com/fd2q4qpGDj
— BJP (@BJP4India)తన పార్టీపైఉన్నహిందూ వ్యతిరేక వైఖరి ముద్ర తొలగించుకొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ విమర్శలు చేసింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారని బీజేపీమండిపడింది. దేవుళ్లపై అంత ప్రేమ ఉన్న కేజ్రీవాల్ దీపావళికి బాణసంచా కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.