వారం రోజుల ఉత్కంఠకు తెర: సోనావాల్‌కు చుక్కెదురు.. అసోం సీఎంగా బిశ్వశర్మ

By Siva KodatiFirst Published May 9, 2021, 2:25 PM IST
Highlights

అసోంలో వారం రోజుల హైడ్రామాకు తెరపడింది. హిమంత బిశ్వశర్మను నూతన ముఖ్యమంత్రిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.దీంతో ఆయనను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు

అసోంలో వారం రోజుల హైడ్రామాకు తెరపడింది. హిమంత బిశ్వశర్మను నూతన ముఖ్యమంత్రిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.దీంతో ఆయనను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం  సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు.

ఇప్పటికే శర్బానంద సోనావాల్ సైతం సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం సోనవాల్, బిశ్వ శర్మలు పోటీపడ్డారు. తనకు 40 మంది ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాల మద్ధతు వుందని హిమంత అధిష్టానం ముందు బలప్రదర్శన చేశారు.

Also Read:అస్సాం సీఎం పీఠం ఎక్కేదెవరు? ఇంకా తేలని అనిశ్చితి !!

అయితే తన పరిపాలనకే ప్రజలు ఓటు వేశారని సోనావాల్ వాదించారు. దీంతో ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది అధిష్టానం. చివరికి హిమంత బిశ్వ శర్మ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. అసోం సీఎంగా బిశ్వ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 126 సీట్లున్న అసోం అసెంబ్లీలో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్‌ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

click me!