కరోనా జోరు: యూపీ, ఢిల్లీలో లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగింపు

By narsimha lodeFirst Published May 9, 2021, 12:09 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతిని తగ్గించేందుకు గాను  లాక్‌డౌన్ ను ఈ నెల 17వ తేదీకి పొడిగిస్తూ ఆ రాష్టర ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. 
రాష్ట్రంలో  పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను ఈ నెల 17వ తేదీ వరకు పొడిస్తున్నట్టుగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

లక్నో: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతిని తగ్గించేందుకు గాను  లాక్‌డౌన్ ను ఈ నెల 17వ తేదీకి పొడిగిస్తూ ఆ రాష్టర ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో  పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను ఈ నెల 17వ తేదీ వరకు పొడిస్తున్నట్టుగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

రాష్ట్రంలో తాజాగా కరోనాతో 298 మంది మరణించారు.కొత్తగా 26,847 కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,80,315 కి చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో  15,170 మంది మరణించారు. కరోనాతో కాన్పూరులో18, లక్నోలో 38, జాన్సీలో 12, మీరట్ , అలహాబాద్ , గౌతం బుద్దనగర్ లలో 11 మంది చొప్పున మరణించారు. లక్నోలో 2,179, మీరట్ లో 1518,ముజఫర్‌నగర్ లో 1485, షహరన్ పూర్ , గౌతం బుద్దనగర్ లో 1188  కరోనా కేసులు  నమోదయ్యాయి. 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4.03 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 4 వేల మంది మరణించారు. వరుసగా నాలుగు రోజుల పాటు 4 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్ లు విధిస్తున్నాయి. 

 

ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీలో లాక్‌డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం నాడు ప్రకటించారు.

లాక్‌డౌన్ ను పొడిగించాలని  సుమారు 85 శాతం ప్రజలు కోరుకొన్నారు. మరో 70 శాతం ప్రజలు  2 వారాల పాటు  లాక్‌డౌన్ ను పొడిగించాలని కోరుకొన్నారు. లాక్‌డౌన్ విషయమై ఢిల్లీ ప్రభుత్వం ఆన్‌లైన్ లో సర్వే నిర్వహించింది. 47 శాతం ప్రజలు 3 వారాల పాటు లాక్‌డౌన్ ను పొడిగించాలని కోరుకొన్నారు.  లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను  నిలిపివేశారు.

click me!