hijab row : హిజాబ్ నిషేధం.. మంగళూరులో తరగతులకు దూరంగా ఉంటున్న పలువురు ముస్లిం బాలిక‌లు

Published : Jun 15, 2022, 12:19 PM IST
hijab row : హిజాబ్ నిషేధం.. మంగళూరులో తరగతులకు దూరంగా ఉంటున్న పలువురు ముస్లిం బాలిక‌లు

సారాంశం

కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం అమలులో ఉండటంతో పలువురు ముస్లిం బాలికలు తరగతులకు హాజరుకావడం లేదు. తమని హిజాబ్ ధరించి తరగతులకు హాజరు అయ్యేలా అనుమతించాలని కోరుతున్నారు. అయితే దీనికి కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. 

పాఠశాల, కళాశాలలో హిజాబ్ ను ధ‌రించ‌కూడ‌ద‌ని క‌ర్ణాట‌క హైకోర్టు మూడు నెల‌ల కింద‌ట తీర్పు వెలువ‌రించింది. అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మంగళూరులో దాదాపు 19 మంది బాలిక‌లు పాఠ‌శాల‌ల‌కు దూరంగా ఉంటున్నారు. వీరంతా హలియాంగాడి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలకు చెందిన స్టూడెంట్లు. 

జమ్మూలో ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్న చిరుతపులి..

ఈ ఏడాది మార్చి 15న కర్ణాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ముస్లిం మహిళలు తలకు ముసుగు ధరించడం ఇస్లాంలో మతపరమైన ఆచారం కాదని పేర్కొంది.దీంతో అప్ప‌టి నుంచి ముస్లిం బాలికలను హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడానికి హలియాంగాడి కళాశాల అనుమతించలేదు. కాగా హైకోర్టు హిజాబ్ ఉత్తర్వులు డిగ్రీ కాలేజీలను కవర్ చేయవని, ప్రీ-యూనివర్శిటీ కాలేజీలకు మాత్రమే వర్తిస్తాయని అస్మా అనే అమ్మాయి వాదిస్తోంది.

బీజేపీ బుల్డోజ‌ర్ ను రాజ్యాంగం నిలువ‌రిస్తుంది - స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

‘‘ నేను తరగతులకు హాజరై దాదాపు మూడు నెలలు అవుతోంది. నేను వచ్చే సెమిస్టర్ ఫీజులను కూడా చెల్లించాను. నేను నా చదువును ఆపివేశాను. ఇక నుంచి నేను కంప్యూటర్ క్లాసుల్లో చేరాలని అనుకుంటున్నాను. అయితే హిజాబ్ ధరించి క్లాసులకు హాజరు కావడానికి నా కాలేజీ న‌న్ను అనుమ‌తిస్తుంద‌ని నాకు ఇప్ప‌టికీ ఆశ ఉంది. ’’ అని అస్మా తెలిపినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. 

ఇదే విష‌యంలో హలియాంగాడి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ కె మాట్లాడుతూ.. ముస్లిం విద్యార్థులను తిరిగి తరగతుల్లో చేరడానికి, హైకోర్టు ఉత్తర్వులను పాటించేలా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కళాశాల యాజ‌మాన్యం కూడా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేదని ఆయన అన్నారు. 

టీఆర్ఎస్ బాటలోనే ఆప్: మమత మీటింగ్ కి కేజ్రీవాల్ పార్టీ దూరం

ఈ వివాదం ఉడిపిలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో చెలరేగింది. పలువురు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడంతో హిందూ స్టూడెంట్లు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో తమకు తరగతి గదుల్లో హిజాబ్ ధ‌రించే హ‌క్కును క‌ల్పించాల‌ని కోరుతూ ముస్లిం బాలికలు క‌ర్ణాట‌క హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే ఈ కేసును పలు విడ‌త‌ల్లో కోర్టు విచారించింది. చివ‌రికి విద్యార్థులు దాఖ‌లు చేసిన పిటిష‌న్లు హైకోర్టు మార్చి 16న కొట్టివేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ తీర్పును వెలువ‌రించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఖ‌చ్చిత‌మైన మతపరమైన ఆచారం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని హైకోర్టు పూర్తి స్థాయి ధ‌ర్మాస‌నం పేర్కొంది. యూనిఫాంలు ధ‌రించాల‌ని, హిజాబ్ ధరించడాన్ని పరిమితం చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు సమర్థించింది.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం