బీజేపీ బుల్డోజ‌ర్ ను రాజ్యాంగం నిలువ‌రిస్తుంది - స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

Published : Jun 15, 2022, 11:21 AM IST
బీజేపీ బుల్డోజ‌ర్ ను రాజ్యాంగం నిలువ‌రిస్తుంది - స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

సారాంశం

బీజేపీని రాజ్యాంగం, చట్టం ఎదురించి నిలువరిస్తుందని ఉత్తప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం నాటి అల్లర్లకు పాల్పడిన నిందితుడి పేరుపై ఇళ్లు లేకున్నా.. దానిని కూల్చడం సరైంది కాదని అన్నారు. ఆ ఇంటిని ఇప్పుడు ఎవరు బాగు చేసి ఇస్తారని ప్రశ్నించారు. 

బీజేపీ బుల్డోజ‌ర్ ను రాజ్యాంగం ఆపేస్తుంద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ హెచ్చ‌రించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు కూల్చివేసిన ఇల్లు శుక్రవారం నాటి హింసలో ప్రధాన నిందితుడైన జావేద్ మహ్మద్‌కు చెందినది కాదని చెప్పారు. ప్ర‌భుత్వం కావాల‌నే అత‌డి ఇళ్ల‌ను ధ్వంసం చేసింద‌ని అన్నారు. 

“ రాజ్యాంగం, చట్టం బీజేపీ బుల్డోజ‌ర్ ను నిలిపివేస్తుంది. అధికారులు కూల‌గొట్టిన ఇంటికి సంబంధించిన ప‌న్నుల‌ను కుటుంబ స‌భ్యులు చెల్లించారు. అది అక్ర‌మ నిర్మాణం అయిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఎందుకు ప‌న్నులు తీసుకుంటోంది. శుక్ర‌వారం నాటి ఘ‌ట‌న‌లో నిందితుడు ఆ ఇంటి య‌జ‌మాని కాద‌ని పేప‌ర్లు చెబుతున్నాయి. ఆ ఇళ్లు అత‌డి భార్య పేరు మీద ఉంది. మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వం త‌న త‌ప్పును అంగీక‌రిస్తుందా ? ఇంటిని బుల్డోజ్ చేసిన అధికారులు దానిని పునర్నిర్మిస్తారా అనేది పెద్ద ప్ర‌శ్న. ’’ అని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Strawberry Super Moon 2022 : ఆకాశాన్ని వెలిగించిన స్ట్రాబెరీ సూపర్ మూన్.. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌ను నిరసిస్తూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌యాగ్ రాజ్ లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌ధాన సూత్రధారిగా పేర్కొంటూ పోలీసులు జావేద్ మహమ్మద్ అనే వ్య‌క్తిని అరెస్టు చేశారు. అత‌డి ఇంటిని కూడా కూల‌గొట్టారు. అయితే అత‌డు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసిద్ధ రాజకీయవేత్త. కాగా జావేద్ భార్య పేరు మీద ఇల్లు ఉన్నందున కూల్చివేత చట్టానికి విరుద్ధమని న్యాయవాదుల బృందం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.ఈ కూల్చివేత ఘ‌ట‌న‌పై ఆ కుటుంబ స‌భ్యులు స్పందిస్తూ.. త‌మ‌కు ఈ నిర్మాణంపై ఇంత వ‌ర‌కు నోటీసులు రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

‘‘ నేను ఒక విష‌యం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, నిజమైన హిందువు ఏ మతాన్ని కించ‌ప‌ర్చ‌డు. ఎవ‌రినీ అమానించ‌లేడు. నిజమైన హిందువు మరొక మతంపై విద్వేశ‌క‌ర‌మైన భాష‌ను ఉప‌యోగించ‌డు. దీనికి రాజ్యాంగం అనుమతించదు. చట్టం అనుమతించదు. ’’ అని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి అఖిలేష్ యాద‌వ్ అన్నారు. 

టీఆర్ఎస్ బాటలోనే ఆప్: మమత మీటింగ్ కి కేజ్రీవాల్ పార్టీ దూరం

జ్ఞాన్ వ్యాపి మ‌సీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల అరాధ్యుడైన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో రెండు వ‌ర్గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ప్ర‌యాగ్ రాజ్ తో పాటు మ‌రి కొన్ని ప‌ట్ణ‌ణాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ప‌శ్చిమ బెంగాల్ లోని హౌరా చేప‌ట్టిన నిర‌స‌న‌లు కూడా హింసాత్మ‌కంగా మారాయి. జార్ఖండ్ లోని రాంచీలోనూ హింసాకాండ చెల‌రేగింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 29 మందిని అరెస్టు చేసిన‌ట్టు ఆ రాష్ట్ర పోలీసులు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం