యువతులతో కబడ్డీ.. ఆ వీడియో తీసినవాడు వచ్చే జన్మలో కూడా అనుభవిస్తాడు: ప్రజ్ఞా ఠాకూర్‌ శాపం

Siva Kodati |  
Published : Oct 16, 2021, 08:42 PM IST
యువతులతో కబడ్డీ.. ఆ వీడియో తీసినవాడు వచ్చే జన్మలో కూడా అనుభవిస్తాడు:  ప్రజ్ఞా ఠాకూర్‌ శాపం

సారాంశం

వివాదాస్పద వ్యాఖ్యలు.. చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ (bjp) ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ((pragya singh thakur) ఇటీవల కబడ్డీ ఆడిన విషయం తెలిసిందే. తాను కబడ్డీ ఆడుతోన్న సమయంలో వీడియో తీసిన అజ్ఞాత వ్యక్తిపై ప్రజ్ఞా ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని రావణుడితో పోల్చారు. అతనికి సంస్కరం లేదని.. ఆ వ్యక్తి వృద్ధాప్యంలోనే కాకుండా మరో జన్మలో కూడా దారుణ పరిస్థితులు అనుభవిస్తాడని ప్రజ్ఞా ఠాకూర్‌ శపించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు.. చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ (bjp) ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ((pragya singh thakur) ఇటీవల కబడ్డీ ఆడిన విషయం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్ (madhya pradesh) రాజ‌ధాని భోపాల్‌లోని (bhopal) కాళీమాత‌ దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్న అనంతరం.. ఆమె స్థానిక క్రీడాకులతో కలిసి కబడ్డీ (kabaddi)ఆడారు. కాగా ఆ సమయంలో ఎవరో వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరలయ్యింది. 2008లో మహారాష్ట్రలోని (maharashtra) మాలేగావ్‌ (malegaon) ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. 

అయితే అనారోగ్య కారణాలు చెప్పి ఆమె బెయిల్‌పై (bail) విడుదలయ్యారు. ఆరోగ్యం బాగాలేదంటూ బెయిల్ తీసుకున్న ఎంపీ బేషుగ్గా కబడ్డీ ఆడుతూ వీడియోలో కనిపించడంతో.. పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాను కబడ్డీ ఆడుతోన్న సమయంలో వీడియో తీసిన అజ్ఞాత వ్యక్తిపై ప్రజ్ఞా ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని రావణుడితో పోల్చారు. అతనికి సంస్కరం లేదని.. ఆ వ్యక్తి వృద్ధాప్యంలోనే కాకుండా మరో జన్మలో కూడా దారుణ పరిస్థితులు అనుభవిస్తాడని ప్రజ్ఞా ఠాకూర్‌ శపించారు.

ALso Read:అమ్మాయిలతో కలిసి 'క‌బ‌డ్డీ' .. కూతపెట్టిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌, వీడియో వైరల్

మొన్నామధ్య ప్రజ్ఞా ఠాకూర్ ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని కోర్టుకు చెబుతున్న ఎంపీ.. ఇలా డ్యాన్స్‌లు చేయడం, బాస్కెట్‌బాల్ ఆడటం ఏంటంటూ సెటైర్లు వేశారు. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే ఆమె.. ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ ఆడటం, డ్యాన్సులు చేయడంతో ప్రతిపక్షనేతలు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్.. పాదం కదుపుతూ అక్కడున్న వారిని డ్యాన్స్ చేయాలంటూ ఉత్సాహపరిచారు.

అనంతరం ప్రజ్ఞా ఠాకూర్ వచ్చి, ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పెళ్లికుమార్తెలు మీడియాతో చెప్పారు. రోజు కూలీ అయిన ఓ వధువు తండ్రి మాట్లాడుతూ.. ఎంపీ సహాయం చేసుండకపోతే కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావన్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి కామెంట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu