దారుణం... మూగ బాలికపై సామూహిక అత్యాచారం..

Published : Jan 16, 2020, 08:39 AM IST
దారుణం... మూగ బాలికపై సామూహిక అత్యాచారం..

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు మూగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. 

నిర్భయ, దిశ అంటూ ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కూడా... సమాజంలో మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు దోషులకు ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా... మహిళలకు మాత్రం రక్షణ లభించడం లేదు. తాజాగా మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు మూగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేవా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులతో సహా ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read సంక్రాంతి స్పెషల్... 1995 కేజీల కిచిడీ.. గిన్నీస్ రికార్డ్...

బాధితురాలి వాంగ్మూలాన్ని ట్రాన్స్‌లేటర్ల సహాయంతో నమోదు చేస్తున్నామని ఎస్పీ అబిద్‌ ఖాన్‌ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా... హర్యానాలోని పంచకులలో కూడా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి కరాటే నేర్చుకుంటుంది. ఈ క్రమంలో కరాటే మాస్టరే ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విచారణ అధికారి రీటా వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం