ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్యకర్తలందరికీ ఆరోగ్య భద్రత..

By Sairam IndurFirst Published Feb 1, 2024, 11:50 AM IST
Highlights

ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్యకర్తలందరికీ ఆరోగ్య భద్రత కల్పించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని ప్రకటించారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె దేశంలోని ఆరోగ్య కార్యకర్తలందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని చెప్పారు. ఈ పథకం కింద అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామన్నారు.

union budget 2024:బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్, మొరార్జీ రికార్డు సమం

పీఎం ఆవాస్ యోజన్ గ్రామీణం 3 కోట్ల ఇళ్ల నిర్మించినట్టు తెలిపారు.  2 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 2047 నాటికి ఇండియా అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. వేగంగా, సమతుల్యతతో కూడిన అబివృద్ది దేశంలో జరుగుతోందని అన్నారు. 

click me!