ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ మృతికి సంతాపం: జ్ఞాపకాలను నెమరేసుకున్న మోడీ

Published : Apr 02, 2023, 01:44 PM ISTUpdated : Apr 02, 2023, 01:46 PM IST
ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ మృతికి సంతాపం: జ్ఞాపకాలను నెమరేసుకున్న మోడీ

సారాంశం

ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ  మృతి పట్ల ప్రధాని మోడీ  సంతాపం తెలిపారు.  దురానీ కుటుంబ సభ్యులకు ప్రధాని  సానుభూతి తెలిపారు.    

న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ  మృతి పట్ల  ప్రధాని  నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం  చేశారు. దురానీతో తనకున్న జ్ఞాపకాలను మోడీ నెమరేసుకున్నారు. 

 

క్రికెట్ ప్రపంచంలో  ఇండియా ఎదుగుదలలో  దురానీ కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తు  చేసుకున్నారు.  దురానీ ఓ లెజెండ్  గా ఆయన అభివర్ణించారు.  స్వతహాగా  ఆయన  ఓ సంస్థ వంటివాడని  మోడీ అభిప్రాయపడ్డారు. దురానీ మృతి పట్ల  మోడీ సంతాపం వ్యక్తం  చేశారు. దురానీ  కుటుంబ సభ్యులకు  ప్రధాని  మోడీ సానుభూతిని తెలిపారు.  దురానీ  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా మోడీ  తెలిపారు. 

సలీం దురానీతో  పలు సందర్భాల్లో తనకు మాట్లాడే అవకాశం లభించిందన్నారు.  2004లో  జామ్ నగర్ లో జరిగిన  కార్యక్రమంలో  దురానీతో తాను కలిసిన సందర్భాన్ని మోడీ గుర్తు  చేసుకున్నారు.  ప్రముఖ క్రికెటర్ వినూ మన్కడ్  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  దురానీతో  కలిసి  పాల్గొన్న  ఫోటోలను మోడీ  ట్విట్టర్ వేదికగా  షేర్  చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్