ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలి - మాజీ ప్రధాని దేవేగౌడ

By Asianet NewsFirst Published Apr 2, 2023, 1:34 PM IST
Highlights

ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ సూచించారు. ప్రతిపక్ష పార్టీల ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. 

లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. శనివారం ఆయన ప్రత్యేకంగా వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని, ఈ దేశంలో నాయకత్వ సంపద ఉందని అన్నారు.

కరోనా కలవరం.. మళ్లీ మూడు వేలు దాటిన కొత్త కేసులు.. ఆరు నెలల్లో ఇవే అత్యధికం..

కర్ణాటకలో మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ విజయావకాశాలపై ధీమా ఆయన ధీమా వ్యక్తం చేశారు. వయోభారం కారణంగా క్రియాశీల ప్రచారానికి దూరంగా ఉన్న ఈ సీనియర్ నేత.. ఈ ఏడాది ఇతర రాష్ట్రాల ఎన్నికలు 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు నాంది పలుకుతాయని అన్నారు. 

రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ వ్యూహం ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ.. రాష్ట్రం అంతటా తమ పార్టీ బాగా పనిచేస్తుందన్నారు. తాము విభజన అజెండా కోసం తాము ఓట్లు అడగడం లేదన్నారు. సమ్మిళిత సామాజిక, అభివృద్ధి దార్శనికత - పంచరత్న కార్యక్రమం పేరుతో ఓట్లు అడుగుతుమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్ర‌ధాని మోడీ పై అభ్యంతరకర వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ నేత‌పై కేసు న‌మోదు

తాము కేవలం మైసూరు ప్రాంతానికే పరిమితమయ్యామని జాతీయ పార్టీలు తెలివిగా ప్రచారం చేస్తున్నాయని, కానీ తమకు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని వర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. గతం నుంచి తమకు మైసూర్ అధిక మద్దతు ఇచ్చిందన్న మాట వాస్తవమే అని, కానీ ఈ సారి తమ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధిస్తామని తెలిపారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా అందరి కోసం పనిచేశానని, ఏనాడూ ప్రాంతాల మధ్య వివక్ష చూపలేదని అన్నారు. తన కెరీర్ లో అబద్ధాలను తిప్పికొట్టడానికి ఎప్పుడూ ఖరీదైన పీఆర్ ఏజెన్సీలను నియమించుకోలేదని అన్నారు. 

పరువు నష్టం కేసులో శిక్షను సవాలు చేసేందుకు సిద్దమైన రాహుల్ గాంధీ.. రేపే సూరత్ కోర్టులో పిటిషన్..!

కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ, ఇతర రాష్ట్రాల ఎన్నికలు 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయనున్నాయని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాల ఐక్యతను పెంపొందించడంలో కాంగ్రెస్ పాత్ర ఏమిటనే ప్రశ్నకు దేవేగౌడ సమాధానమిస్తూ.. ముందుగా కాంగ్రెస్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని, ఈ దేశానికి నాయకత్వ సంపద ఉందని చెప్పారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం చాలా దురదృష్టకరమని అన్నారు. 
 

click me!