Summons to God: విగ్ర‌హానికి కోర్టు స‌మాన్లు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హైకోర్టు

By Rajesh KFirst Published Jan 8, 2022, 7:01 AM IST
Highlights

Summons to God:  తిరుపూర్‌ జిల్లా శివిరిపాలయామ్‌లోని పరమశివన్‌ స్వామి ఆలయంలో పురాతన విగ్రహం చోరీ కి గురైంది. ఆ విగ్ర‌హాన్ని ప‌రిశీలించ‌డానికి ప్రత్యేక కోర్టు ఎదుట ప్రవేశపెట్టి ఆలయ నిర్వాహకులు స‌మాన్లు జారీ చేసింది. పునఃప్రతిష్ఠించి పూజలు కూడా జ‌రుగుతోన్న విగ్ర‌హాన్ని ఎలా కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని   భక్తులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. విగ్రహాన్ని తీయాల్సిన అవసరం లేదని తెలిపింది.
 

Summons to God: ఓరీ దేవుడా ! విగ్ర‌హనికి .. విగ్ర‌హమే నిరూప‌ణ‌.. (నువ్వు) విగ్ర‌హం చోరీకి గుర‌య్యింది. మ‌ళ్లీ (నిన్ను) విగ్ర‌హం దొరికాక భక్తులు తీసుకెళ్లి పున ప్ర‌తిష్టించి..  పూజ‌లు చేశారు. అయితే.. నిజంగా (అది నువ్వేనా? ) పాత‌ విగ్ర‌హామేనా?  కోర్టు ఎదుట (నిన్ను) విగ్ర‌హాన్ని త‌నిఖీ చేయాల్సి ఉంటుంది. కోర్టు ఎదుట (విగ్ర‌హానికి) విగ్రహాన్ని కోర్టుకు తీసుక‌రావాలని  సమన్లు జారీ చేసిందో తమిళనాడు కోర్టు. ఈ  న్యాయస్థానం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్న‌త న్యాయ స్థానం. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విచారణకు విగ్రహాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

వివరాల్లోకెళ్తే.. తిరుపూర్‌ జిల్లా శివిరిపాలయామ్‌లోని పరమశివన్‌ స్వామి ఆలయంలో పురాతన విగ్రహం కొన్నాళ్ల కిందట చోరీ కి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విగ్రహాన్ని కనిపెట్టారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి విగ్రహాన్ని కనిపెట్టారు. కుంభకోణంలోని ప్రత్యేక న్యాయస్థానం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆలయ యాజమాన్యానికి అప్పగించారు. దీంతో ఆ విగ్ర‌హాన్ని మ‌రో సారి గర్భగుడిలో ప్రతిష్టించారు . 

నిందితుల‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో  పట్టుకున్న విగ్ర‌హం స‌రైన‌దే అని తెలుసుకోవడానికి .. ఆ విగ్రహాన్ని కోర్టు ఎదుటకు ప్రవేశపెట్టాల‌ని ఆలయ నిర్వాహకులకు స‌మాన్లు జారీ చేసింది కుంభ‌కోణం ప్ర‌త్యేక కోర్టు. సంబంధిత అధికారుల కోర్టు చర్యను సవాల్ చేస్తూ మ‌ద్రాస్ కోర్టులో రిట్ పిటిషన్ ను దాఖాలు చేశారు స్థానికులు.  దాఖాలైన రిట్ పిటిషన్‌పై మ‌ద్రాస్ న్యాయ‌స్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కుంభ‌కోణం న్యాయస్థానం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు  ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విచారణకు విగ్రహాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  ఆలయానికి వెళ్లి విగ్రహాన్ని పరీక్షించవచ్చని తెలిపింది. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

click me!