దారుణం : పదహారు నెలల పసికందుపై తండ్రి హత్యాచారం.. సహకరించిన భార్య..

Published : Jan 08, 2022, 06:32 AM ISTUpdated : Jan 08, 2022, 06:34 AM IST
దారుణం : పదహారు నెలల పసికందుపై తండ్రి హత్యాచారం.. సహకరించిన భార్య..

సారాంశం

16 నెలల పసికందుపై కన్నతండ్రే అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నవమాసాలూ మోసి జన్మనిచ్చిన కన్నతల్లే దీనికి సహకరించడం. ఆ తరువాత చిన్నారిని దారుణంగా చంపేసి, శవాన్ని మాయం చేయబోయారు.. కానీ పట్టుబడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరగగా పూనేలో అరెస్ట్ అయ్యారు. 

పూణే :  వినడానికి, చదవడానికి, జీర్ణించుకోలేని.. విధంగా ఉన్న అత్యంత దారుణమైన ఘటన ఇది. పిల్లల కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంతానసాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ.. తమకు సంతానభాగ్యాన్ని కలిగించే వైద్యుల్ని దేవుళ్లుగా భావిస్తున్నారు. కానీ మరోవైపు కడుపుచించుకుపుట్టిన పిల్లలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కామాంధులైన తండ్రలు. ఇలాంటి దారుణాలు రోజు రోజుకూ పెచ్చుమీరి పోతున్నాయి. అలాంటి పాశవిక ఘటనే ఇది. 

16 నెలల పసికందుపై own father అత్యంత పాశవికంగా molestation చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నవమాసాలూ మోసి జన్మనిచ్చిన కన్నతల్లే దీనికి సహకరించడం. ఆ తరువాత చిన్నారిని దారుణంగా చంపేసి, dead bodyని మాయం చేయబోయారు.. కానీ పట్టుబడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరగగా పూణేలో అరెస్ట్ అయ్యారు. 

ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా గొంతు నులిమి murder చేశాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు mother సహకరించడం అమ్మతనానికే మాయని మచ్చ.. చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా  ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులు గుజరాత్లోని రాజ్కోట్లో వెళ్తుండగా.. మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ్కోట్ కు చెందిన దంపతులు సికింద్రాబాద్ లోఉంటున్నారు. కన్నకూతురిపై  తండ్రి (26) ఈ నెల 3న ఇంట్లో లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించింది. తాము చేసిన ఘోరం మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు వారు మృతదేహాన్ని రాజ్ కోట్ కి తీసుకెళ్లాలని భావించారు.  సికింద్రాబాదులో రాజ్ కోట్ రైలెక్కారు. అయితే ఎంతసేపయినా పాపలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు విషయాన్ని టీటీఈకి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... సోలాపూర్ లో వారిని దింపేసారు.  పోక్సో సహా పలు సెక్షన్ల కింద దంపతులపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ లో శుక్రవారం వెలుగులోకి వచ్చిన మరో సంఘటనలో కన్నతండ్రే కొడుకుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. Hyderabadలోని ఉప్పల్ లో ఈ కిరాతకమైన సంఘటన చోటు చేసుకుంది. కుమారుడి పట్ల తండ్రి అత్యంత నీచంగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. జుగుస్స కరమైన ఈ ఘటనను తల్లి వ్యతిరేకించింది. 

సొంత కుమారుడిని Fatherభరత్ రెడ్డి Sexual harassmentకు గురి చేస్తున్నాడు. ఇది తెలిసిన భరత్ రెడ్డి wife ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భరత్ రెడ్డితో వీణారెడ్డికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. భరత్ నుంచి తన కుమారుడిని రక్షించాలని వీణారెడ్డి పోలీసులను కోరింది.

భరత్ రెడ్డి, వీణారెడ్డి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద, మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటున్నాడు. కుమారుడు తన వద్ద ఉన్నప్పుడు తండ్రి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా భర్త భరత్ రెడ్డిపై వీణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Annamalai Sensational Press Meet: రాజీనామా తర్వాత అన్నామలై సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
తమిళనాడులో కొత్త పార్టీ ఇక విజయ్‍కు చుక్కలే | Annamalai New Party vs CM Vijay? | Asianet News Telugu