ఇస్లాం తీవ్రవాదాన్ని అణచివేస్తాం: ట్రంప్

By narsimha lodeFirst Published Feb 25, 2020, 1:51 PM IST
Highlights

భారత్, అమెరికా మధ్య ఐదు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. మంగళవారం నాడు ట్రంప్, మోడీలు హైద్రాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. 


న్యూఢిల్లీ:ఇస్లాం తీవ్రవాదాన్ని అణచి వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రెండు దేశాలకు ఉపయోగపడుతుందన్నారు.

మంగళవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని హైద్రాబాద్ హౌస్‌లో  ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాలకు చెందిన అధికారులు  సమావేశమయ్యారు. రెండు దేశాలకు చెందిన అధినేతలు   పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Also read:ఉగ్రవాద నిరోధకానికి అమెరికాతో కలిసి పనిచేస్తాం: మోడీ

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్   మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలకు ఉపయోగపడే పర్యటనగా  ట్రంప్ అభివర్ణించారు.  సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకొంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.  ఇండియాతో తమకు ప్రత్యేకమైన  అనుబంధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

Also read:ఢిల్లీ లోహ్యాపీనెస్‌ క్లాస్‌లు: ఆసక్తిగా పరిశీలించిన మెలానియా ట్రంప్

సోమవారం నాడు తన పర్యటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. తనకు ఘనంగా స్వాగతం చెప్పడాన్ని కూడ ఆయన ప్రస్తావించారు.  భారత దేశంతో ఆర్ధిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ట్రంప్ ప్రకటించారు.

వైర్‌లెస్ 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి  చర్చించినట్టుగా ట్రంప్ ప్రకటించారు. రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి  అపాచీ అడ్వాన్స్డ్‌డ్ మిలటరీ ఎంహెచ్-60  హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి  ఒప్పందాన్ని మరింత విస్తరించినట్టుగా ఆయన వివరించారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైందని ట్రంప్ చెప్పారు.

రెండు దేశాల ప్రజల కోసం అద్భుతమైన ఒప్పందాలు చేసుకొన్నామని ట్రంప్ ప్రకటించారు. నార్కో టెర్రరిజం, వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు ట్రంప్ తెలిపారు. సమగ్ర వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.

  

 

click me!