ఉగ్రవాద నిరోధకానికి అమెరికాతో కలిసి పనిచేస్తాం: మోడీ

By narsimha lodeFirst Published Feb 25, 2020, 1:39 PM IST
Highlights

న్యూఢిల్లీలోని హైద్రాబాద్ హౌస్ లో ఇండియా ప్రధాన మంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పలు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 

అమెరికా, ఇండియాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి.మెడికల్ ఉత్పత్తులు, మెంటల్ హెల్త్,  ఈఎక్స్ఎక్స్ మొబైల్, ఇండియన్ ఆయిల్, చార్ట్ ఎనర్జీ, కెమికల్స్ అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.  

మంగళవారం నాడు న్యూఢిల్లీలోని హైద్రాబాద్ హౌస్‌లో ట్రంప్, మోడీతో పాటు రెండు దేశాలకు అందించిన  అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత  వీరిద్దరూ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఇండియా పర్యటనకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  

Also read:ఇస్లాం తీవ్రవాదాన్ని అణచివేస్తాం: ట్రంప్
గడిచిన ఎనిమిది మాసాల్లో  తాను  ఐదు దఫాలు ట్రంప్‌తో భేటీ అయినట్టుగా మోడీ గుర్తు చేసుకొన్నారు.అమెరికాతో భారీ  వాణిజ్య ఒప్పందానికి  చర్చలను ప్రారంభించినట్టుగా మోడీ స్పష్టం చేశారు. 

దౌత్య సంబంధాల్లో రక్షణ సహకారం అత్యంత కీలకమైందని మోడీ చెప్పారు. గత మూడేళ్లలో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో రెండంకెల వృద్ధిని సాధించినట్టుగా మోడీ గుర్తు చేశారు.రక్షణ, వాణిజ్య, భద్రత రంగాల్లో సహకారంపై చర్చించినట్టుగా మోడీ ప్రకటించారు. అణు ఇంధన రంగంలో బంధం బలోపేతం అవుతోందని మోడీ ప్రకటించారు.
 
 

click me!