ఢిల్లీ స్కూల్లో నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి మెలానియాకు స్వాగతం

Published : Feb 25, 2020, 12:26 PM ISTUpdated : Feb 25, 2020, 12:28 PM IST
ఢిల్లీ స్కూల్లో నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి మెలానియాకు స్వాగతం

సారాంశం

ఢిల్లీ స్కూల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ నకు ఢిల్లీ స్కూల్లో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం లభించింది. నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు.

న్యూఢిల్లీ: హ్యాపినెస్ క్లాస్ కు హాజరు కావడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఇరు దేశాల జెండాలను పట్టుకుని విద్యార్థులు ఆమెకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. 

 

Also Read: ఢిల్లీ లోహ్యాపీనెస్‌ క్లాస్‌లు: ఆసక్తిగా పరిశీలించిన మెలానియా ట్రంప్

ఓ విద్యార్థిని మెలానియా నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి స్వాగతం పలికింది. పుసువు, ఎరుపు పూల ముద్రలను అద్దిన తెల్లటి పొడవాటి మిడ్డీ ధరించి మెలానియా పాఠశాలకు వచ్చారు.

 

 దక్షిణ మోతీబాగ్ లోని సర్వోదయ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్ ను సందర్సించి ఆమె విద్యార్థులతో, టీచర్లతో మాట్లాడారు. పాఠశాలను సుందరంగా తీర్చి దిద్దారు.హ్యాపీనెస్ క్లాస్ లో ఆమె చిన్నారులతో ముచ్చటించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం