అక్రమ ఆయుధాలతో పట్టుబడిన పోలీస్ ట్రైనీ అరెస్టు..

Published : Mar 05, 2023, 03:22 PM IST
అక్రమ ఆయుధాలతో పట్టుబడిన పోలీస్ ట్రైనీ అరెస్టు..

సారాంశం

Chandigarh: అక్రమ ఆయుధాలతో ఒక పోలీస్ ట్రైనీ అరెస్టు అయ్యారు. హ‌ర్యానాలో అక్రమ తుపాకులతో పట్టుబడిన రాజస్థాన్ పోలీసు ట్రైనీని సస్పెండ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  

Police Trainee Arrested With Illegal Firearms: హ‌ర్యానాలో అక్రమ తుపాకులతో పట్టుబడిన రాజస్థాన్ పోలీసు ట్రైనీని సస్పెండ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ పోలీసు శాఖలో ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నైనా కన్వాల్ ను ఆయుధాల చట్టం కింద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (క్రైమ్) ఎస్ సెంఘాతిర్ శనివారం సంబంధిత పోలీసు ట్రైనీని సస్పెన్షన్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

"హ‌ర్యానాలోని రోహ్ తక్ లో అక్రమ ఆయుధాలతో పోలీసు ట్రైనీ పట్టుబడ్డారు. ఆయుధ చట్టం కింద నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయంలో స‌ద‌రు పోలీసు ట్రైనీని సస్పెండ్ చేశాం" అని సెంఘాతిర్ తెలిపారు. స్పోర్ట్స్ కోటా కింద ఇటీవ‌ల ట్రైనీని రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu