చెప్పులు తమ డోర్ వద్ద విడుస్తున్నాడని పొరుగింటి వ్యక్తిని చంపేసిన దంపతులు

Published : Mar 05, 2023, 03:15 PM IST
చెప్పులు తమ డోర్ వద్ద విడుస్తున్నాడని పొరుగింటి వ్యక్తిని చంపేసిన దంపతులు

సారాంశం

మహారాష్ట్రలో థానేలో ఓ వ్యక్తిని దంపతులు చంపేశారు. ఆ వ్యక్తి తమ ఇంటి తలుపునకు సమీపంగా చెప్పులు విడిచారనే ఆరోపణలతో వాగ్వాదం జరిగింది. శనివారం రాత్రి ఆ వాగ్వాదం భౌతిక దాడిగా పరిణమించింది. ఆ దాడిలో వ్యక్తి మరణించాడు.  

థానే: మహారాష్ట్రలో ఓ దుర్ఘటన జరిగింది. చాలా చిన్న విషయానికే కోపోద్రిక్తులై ప్రాణం తీశారు. ఇరుగుపొరుగు అన్నాక మంచీ చెడ్డలు ఉంటాయి. సంయమనం పాటించడం అందరికీ అవసరం. కానీ, వారు మాత్రం పోట్లాటకే సిద్ధమయ్యారు. అది కూడా డోర్ వద్ద చెప్పులు విడవడానికి సంబంధించి గొడవ పెట్టుకున్నారు. ఎదుటి వారు తమ ఇంటి తలుపునకు సమీపంగా చెప్పులు విడుస్తున్నారని ఉభయ కుటుంబాలు తరుచూ ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఓసారి తమ ఇంటి డోర్‌కు సమీపంలో చెప్పులు విడుస్తున్నాడని పక్కింటి వ్యక్తితో గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ సీరియస్ కావడం.. భౌతిక దాడికి పాల్పడటం జరిగింది. తీవ్ర గాయాలతో ఆ చెప్పులు విడిచిన వ్యక్తి మరణించాడు.

ఈ ఘటన థానేలోని నయా నగర్‌లో జరిగింది. ఆ దంపతులు, బాధితుడు తరుచూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేవారు. ఎదుటి వారు తమ ఇంటి తలుపు సమీపంలో చెప్పులు విడుస్తున్నారని తరుచూ దూషించుకునేవారు. కానీ, శనివారం రాత్రి ఇలా జరిగిన వాగ్వాదం భౌతిక దాడి వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నట్టు నయా నగర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జిలాని సయెద్ తెలిపారు.

Also Read: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల

అఫ్సర్ ఖాత్రి (54) ఈ గాయాలతో మరణించాడు. మహిళను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె భర్త మాత్రం పరారీలో ఉన్నాడు. వారిద్దరిపై హత్యా నేరారోపణలు మోపబడ్డాయని జిలాని సయెద్ వివరించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?