కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ సోదరుడి ఆత్మహత్య..

Published : Mar 05, 2023, 03:19 PM IST
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ సోదరుడి ఆత్మహత్య..

సారాంశం

కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ దగ్గరి బంధువు, వరసకు సోదరుడు అయిన చంద్రశేఖర్ చకుర్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నేళ్లుగా ఓ వ్యాధితో బాధపడుతున్నాడని, దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. 

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ సోదరుడు మహారాష్ట్రలోని లాతూర్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తుపాకీతో తనను తాను కాల్చుకొని ఈ చర్యకు పాల్పడ్డాడు. 81 ఏళ్ల మాజీ మంత్రి బంధువు, సోదరుడు అయిన ఆయన హన్మంతరావు పాటిల్ ఆత్మహత్యకు చేసుకునేందుకు ముందు తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు సందేశం పంపించాడు.

ఫోన్‌లో కాదు.. ఆయన మెదడులోనే పెగాసెస్ స్పైవేర్ : రాహుల్‌కు శివరాజ్ సింగ్ చౌహన్ కౌంటర్

హన్మంతరావు పాటిల్ ను చంద్రశేఖర్ చకుర్కర్ అని కూడా పిలుస్తారు. ఆయన మాజీ మంత్రి 'దేవ్ఘర్' నివాసానికి సమీపంలోనే నివసిస్తున్నారని, తరచూ నివాసాన్ని సందర్శించేవారని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఈ ఉదయం 9 గంటల సమయంలో తన లైసెన్స్డ్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

న్యాయం చేయండి.. లేదా ఆత్మహత్యకు అనుమతించండి : రాజస్థాన్ గవర్నర్‌కు పుల్వామా అమరవీరుల భార్యల విజ్ఞప్తి

కొన్నేళ్లుగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న ఆయన దానితోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు మంత్రి కుమారుడు కూడా ఉన్నారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దిబేశ్ ఫీవర్, డిప్యూటీ ఎస్పీ జితేంద్ర జగ్దాలే వంటి సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu