హనుమాన్ చాలీసా కేసు.. ఎంపీ నవనీత్ రాణా, భర్త రవికి అరెస్టు వారెంట్ జారీ..

By team teluguFirst Published Dec 1, 2022, 3:54 PM IST
Highlights

ఏప్రిల్ లో మహారాష్ట్ర వ్యాప్తంగా వివాదం రేకెత్తించిన హనుమాన్ చాలీసా కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ నవీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

హనుమాన్ చాలీసా కేసు విచారణ సందర్భంగా విచారణకు హాజరుకాకపోవడంతో మహారాష్ట్రలోని సెషన్స్ కోర్టు అమరావతి ఎంపీ నవీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు గురువారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వీరిద్దరూ ఏప్రిల్‌లో వారి ఖార్ నివాసం ముంబైలో మత శాంతికి విఘాతం కలిగించారని, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. శివసేనకు హిందుత్వ సూత్రాలను గుర్తుచేసేందుకు గత సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల వారు ఈ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నారు.

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు .. 15 ఏళ్లు దాటితే చాలు...

ఈ జంటపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 153 (ఎ) (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్యాన్ని కాపాడటానికి విఘాతం కలిగించే చర్యలు చేయడం), ముంబై పోలీసు చట్టంలోని సెక్షన్ 135 (పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేశారు.

కొత్త జంటకు భయంకర అనుభవం.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా ఆగ్రహంతో గందరగోళం చేసిన ఏనుగు.. వీడియో వైరల్

కాగా ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నవనీత్‌కు లేఖ రాశారు. అందులో ఠాక్రే వ్యక్తిగత నివాసం ముందు హనుమాన్ చాలీసా జపించాలన్న తన నిర్ణయం సీఎంకు వ్యతిరేకం కాదని చెప్పారు. వాస్తవానికి హనుమాన్ చాలీసా పఠించడంలో తనతో కలిసి రావాలని నేను ముఖ్యమంత్రిని ఆహ్వానించానని తెలిపారు.

ఉద్ధవ్ థాకరే హయాంలో శివసేన తన హిందుత్వ సూత్రాల నుంచి పూర్తిగా దారితప్పిందని, తద్వారా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమిగా ఏర్పడిందని ఆమె ఆరోపించారు. అయితే ఈ కేసులో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. సుమారు రెండు వారాల పాటు వారు జైలులో గడిపిన తరువాత మేలో విడుదలయ్యారు.

వారు రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మరు.. అలాంటి వారు.. : ప్రధాని మోడీ

కాగా.. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఉమేష్ కోల్హే జూన్ 21వ తేదీన హత్యకు గురయ్యాడు. అయితే అమరావతిలో ఉన్న అతడి ఇంటి ముందు ఈ దంపతులు జూలైలో హనుమాన్ చాలీసా పఠించారు. ఉమేష్ కోల్హే హంతకులని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. అలా చేస్తేనే దేశంలో ఇలాంటి నేరాలు పునరావృతం చేయడానికి ఎవరూ సాహసించరని నవనీత్ రాణా ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.

click me!