ముస్లిం అమ్మాయిల పెళ్లిపై జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు .. 15 ఏళ్లు దాటితే చాలు... 

By Rajesh KarampooriFirst Published Dec 1, 2022, 3:28 PM IST
Highlights

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ద్వివేది ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది.

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కె ద్వివేది ధర్మాసనం పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం.. ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు చెప్పింది. ఈ క్రమంలో 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను, కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.

ముస్లిం యువతి వివాహం ముస్లిం పర్సనల్ లా కిందే జరుగుతుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అటువంటి పరిస్థితిలో 15 ఏళ్ల అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చనీ, అందుకు అడ్డు చెప్పే హక్కు లేదని తెలిపింది.  దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ మహ్మద్ సోను జార్ఖండ్ హైకోర్టులో కొట్టివేత పిటిషన్‌ను దాఖలు చేశారు.  


బాలిక తండ్రి కేసు 

జంషెడ్‌పూర్‌లోని జుగ్‌సలాయ్‌లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నారని ఆమె తండ్రి ఆరోపించారు.  బీహార్‌లోని నవాడాకు చెందిన 24 ఏళ్ల యువకుడు మహ్మద్ సోనుపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై 366ఎ, 120బి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ మహ్మద్ సోను జార్ఖండ్ హైకోర్టులో కొట్టివేత పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బాలిక తండ్రి తన కుమార్తె వివాహానికి అభ్యంతరం లేదని కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. విచారణ సందర్భంగా..అల్లా దయవల్ల తన కూతురికి మంచి జోడీ దొరికిందని తెలిపారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని బాలిక తరఫు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు.

అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎస్.కె.ద్వివేది సింగిల్‌ బెంచ్‌ .. యువకుడిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌, క్రిమినల్‌ కేసులను రద్దు చేయాలని ఆదేశించింది. ముస్లిం యువతి వివాహాన్ని ముస్లిం పర్సనల్ లా నిర్వహిస్తుందనే విషయం స్పష్టమవుతోందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం..15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ముస్లిం యువతి తన సంరక్షకుల జోక్యం లేకుండా తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చునని జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది.

click me!