రోడ్డు ప్రమాదంలో హానన్ :కేరళలో చేపలు అమ్మే అమ్మాయిగా ఫేమస్

By rajesh yFirst Published Sep 3, 2018, 6:13 PM IST
Highlights

డాటర్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్, కేరళ ఖాదీ అంబాసిడర్ హానన్ హమీద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కళాశాలకు వెళ్లొచ్చిన తర్వాత చేపలు అమ్మే హానన్ రెండు నెలల
క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఉదయం కోజికోడ్ లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొడంగళూర్
వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

కేరళ: డాటర్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్, కేరళ ఖాదీ అంబాసిడర్ హానన్ హమీద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కళాశాలకు వెళ్లొచ్చిన తర్వాత చేపలు అమ్మే హానన్ రెండు నెలల
క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఉదయం కోజికోడ్ లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొడంగళూర్వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

స్థానికులు ఆమెను కొచ్చిలోని ఓఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం, వెన్నెముకకు బాగా దెబ్బ తగలడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. హనన్‌
ఇడుక్కిలోని ప్రైవేటు‌ కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. కుటుంబాన్ని పోషించుకోవడం... తన కాలేజీ ఫీజుల కోసం కాలేజీకి వెళ్లొచ్చి ఖాళీగా ఉన్న సమయంలో చేపలు
అమ్మడంతో హనన్‌ ఫేమస్‌ అయ్యింది. 

తన ధైర్యాన్ని, పట్టుదలను చూసిన కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆమెను అభినందించారు. డాటర్‌ ఆఫ్‌ ది కేరళ గవర్నమెంట్‌ గా కితాబిచ్చారు. దాంతోపాటు కేరళ ఖాదీకి
అంబాసిడర్ గా నియమించారు. ఇటీవల కేరళ వరద బాధితులకు హానన్ హమీద్ లక్ష రూపాయలు సాయం చేసి అందరి మన్నలను పొందింది.  దీంతో మళ్లీ హానన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

కేరళ: రూ.1.5 లక్షలు ప్రకటించిన చేపలమ్ముకొనే విద్యార్థిని

 

click me!