వరద నీటితో ఉప్పొంగుతున్న ఈ నది ఉగ్రరూపం చూడండి (వీడియో)

Published : Sep 03, 2018, 03:35 PM ISTUpdated : Sep 09, 2018, 01:25 PM IST
వరద నీటితో ఉప్పొంగుతున్న ఈ నది ఉగ్రరూపం చూడండి (వీడియో)

సారాంశం

మొన్నటివరకు దక్షిణాదిలోని కేరళ,కర్ణాటక లను అతలాకుతలం చేసిన వరదలు ఇప్పుడు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. డిల్లీ, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. నదులు, చెరువులు , కాలువలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.  

ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో ఈ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ఈ వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు ప్రమాదం పొంచివున్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఈ వరదల కారణంగా టెహ్రీ గర్హ్‌వాల్ జిల్లాలోని కెంప్టీ ఫాల్స్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ ఉదృతి పెరగడంతో పోలీసులు పర్యాటకులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ప్రవాహానికి సమీపంలోని హోటళ్లను,దుకాణాలు, నివాసాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

వీడియో

PREV
click me!

Recommended Stories

జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు
పేపర్ లీక్ చేయాలంటే తడిసిపోయేలా కొత్త చట్టం పదేళ్లు జైలుశిక్ష, 10కోట్లు జరిమానా| Asianet News Telugu