హోలీ రంగులతోపాటు గల్ఫ్ టికెట్ బహుమానాలు.. భారత విజేతలు వీరే

By Mahesh K  |  First Published Mar 26, 2024, 6:09 PM IST

గల్ఫ్ టికెట్‌ విజేతలు పలువురు భారతీయులు తమ అదృష్టాన్ని తడిమిచూసుకున్నారు. జీవితాలు మలుపుతిప్పుకునేలా బహుమానాలు గెలుచుకున్నారు.
 


దేశమంతా హోలీ రంగు కేళిలో మునగడానికి సిద్ధం అవుతున్న సందర్భంలో గల్ఫ్ టికెట్ కొందరి జీవితాలనే మార్చేసింది. వారి జీవితాలను మలుపుతిప్పే తీపి కబురు చెప్పింది. లక్షలు అందించి వారి ఆనందాలను ఆకాశానికి ఎత్తింది.

గల్ఫ్ టికెట్ డ్రాలో పలువురు భారతీయులు గెలిచారు. ఫార్చూన్ 5 డ్రాను మార్చి 22ప తీశారు. ఇందులో ఐదు నెంబర్లకు గాను నాలుగు నెంబర్లు కలిసిన వారు లక్ష ఏఈడీలను (సుమారు రూ. 22.5 లక్షలు)ల చొప్పున గెలుచుకున్నారు. ఇందులో కేరళ నుంచి ఇబ్రహీం కుట్టి సీకే, తమిళనాడు నుంచి ఫాత్మరాజా రాజంగం, తెలంగాణ నుంచి స్వాతిరెడ్డి నిమ్మలలు ఉన్నారు. వీరికితోడు ఫార్చూన్ 5 రాఫుల్ విన్నర్లుగా కేరళకు చెందిన బైజు వీకే, తెలంగాణ నుంచి గుమ్మల దుబ్బయ్య, అబ్బాస్ ఖాసీంలు ఉన్నారు. వీరంతా హోలీతోపాటు తమ అదృష్టాన్ని కూడా చవిచూశారు.

Latest Videos

ఇక సూపర్ 6 డ్రాను 23న తీశారు. ఇందులో తమిళనాడు నుంచి కవియరసన్ వీ, ఏఈడీ 50,000 (సుమారు రూ. 11.25 లక్షలు) గెలుచుకున్నారు. ఆయనకు ఆరు నెంబర్లకు గాను నాలుగు నెంబర్లు కలిశాయి.

వీరికితోడు సూపర్ 6 రాఫుల్స్ విజేతలుగా రాజస్తాన్‌కు చెందిన విన్సెంట్ ట్రెవర్, తమిళనాడుకు చెందిన ఇళయరాజా గోపాలక్రిష్ణన్, తమిళనాడుకు చెందిన బినురాజ్ నికోలాస్, కేరళ నుంచి ఫాహద్ వెంబయిల్ హాసన్, కేరళ నుంచి నరేంద్రన్ కే కమలసనన్‌లు ఉన్నారు. వీరంతా ఏఈడీ 5,000 (సుమారు రూ. 1.12 లక్షలు) గెలుచుకున్నారు.

click me!