
గుజరాత్ : ఓ మహిళా కాంగ్రెస్ నేతను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘనా పటేల్ అనే గుజరాత్ కు చెందిన మహిళా కాంగ్రెస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 10 లక్షల విలువైన మద్యాన్ని ఈ క్రమంలో సీజ్ చేసినట్టుగా కూడా వారు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం గుజరాత్ పోలీసులు.. మేఘన పటేల్ అనే కాంగ్రెస్ నేతను విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారు.
అంతకుముందు పోలీసులకు మేఘనా పటేల్ తన బొలెరో వాహనంలో విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పిప్లాడు రోడ్డు ప్రాంతంలో ఆమె కారును ఆపి తనిఖీలు చేశారు. మేఘన పటేల్ కోసం రూ7.5 లక్షల కు పైగా విలువైన విదేశీ మద్యాన్ని తీసుకువస్తున్నట్లుగా సదరు కారు నడుపుతున్న వ్యక్తి తెలిపాడు. ఆ కారులో నుంచి రూ. 10 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ మొత్తం మధ్యాహ్నం సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు..
కాగా, ఈ విదేశీ మద్యంకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విక్రయించారు అనే విషయాల మీద కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. మద్యం పట్టుబడిన సమయంలో కారు నడుపుతున్న మేఘన పటేల్ డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్య నిందితురాలుగా మేఘనా పటేల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా కాంగ్రెస్లో పనిచేశారు.