
హిందూ మతంలోని పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు అత్యాచార నిందితుడు నిత్యానందను వేధిస్తున్నారని విజయప్రియ నిత్యానంద వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే ఆమె వివరణ ఇస్తూ హిందూ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న కైలాస శాశ్వత రాయబారిగా ఉన్న విజయప్రియ.. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ నిర్వహించిన చర్చలో పాల్గొని నిత్యానందను హింసిస్తున్నారని, ఆయన పుట్టిన దేశం నుంచి కూడా నిషేధిస్తున్నారని ఆరోపించారు.
రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు..
ఐక్యరాజ్యసమితిలో తాను చేసిన ప్రకటనను కొన్ని హిందూ వ్యతిరేక వర్గాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని, ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నాయని, వక్రీకరించాయని ఆమె అన్నారు. ‘‘ ఎస్పీహెచ్ భగవాన్ నిత్యానంద పరమశివం తన జన్మస్థలంలో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులచే హింసకు గురయ్యారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా భారతదేశాన్ని గొప్పగా గౌరవిస్తుంది. భారతదేశాన్ని తన గురుపీఠంగా భావిస్తుంది’’ అని తెలిపారు.
‘‘మా ఆందోళన పూర్తిగా హిందూ వ్యతిరేక శక్తులపై ఉంది. హిందూమతం, కైలాస సర్వోన్నత పీఠాధిపతిపై హింసను ప్రేరేపిస్తున్న ఇలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’’ అని విజయప్రియ నిత్యానంద అని అన్నారు.
ఇది యుద్ధ యుగం కాదని మోడీ చెప్పిప్పుడు ప్రపంచం మొత్తం విన్నది : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా
కాగా.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద భారతదేశం నుంచి కొన్నేళ్ల కిందట పారిపోయాడు. 2020లో తనే ఓ దేశాన్ని స్థాపించినట్టు ప్రకటించారు. దాని పేరు ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అని పేర్కొన్నాడు. ఇది ‘‘ప్రాచీన జ్ఞానోదయ హిందూ నాగరికత దేశం’’ అని ప్రకటించాడు. అయితే నిత్యానంద చెబుతున్న కైలాసం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.
దేశం నుంచి పారపోయిన తరువాత నిత్యానంద దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతారు. కైలాస దేశానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు. కానీ కైలాసకు వర్చువల్ ఉనికి ఉంది. నిత్యానంద సోషల్ మీడియా వేదికగా కైలాస ప్రభుత్వానికి ఓ వెబ్ సైట్ ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్.. వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ..
ఐక్యరాజ్యసమితి సమావేశంలో తనను తాను ‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా శాశ్వత రాయబారి’’గా పరిచయం చేసుకున్న విజయప్రియ, కైలాస ప్రపంచంలోని అనేక దేశాలలో తన రాయబార కార్యాలయాలను, స్వచ్ఛంద సంస్థలను తెరిచిందని పేర్కొన్నారు. అయితే, 'స్వయం ప్రకటిత' వ్యక్తి సంస్థ అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ విషయంపై భారత్ ఇంకా స్పందించలేదు.