అర్బన్ నక్సలైట్స్ ను గుజ‌రాత్ అనుమతించదు - ప్రధాని న‌రేంద్ర మోడీ..

By team teluguFirst Published Oct 10, 2022, 2:14 PM IST
Highlights

అర్బన్ నక్సలైట్స్ ను గుజరాత్ రాష్ట్రంలోకి అనుమతి కానివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారు యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేశారు. 

అర్బన్ నక్సల్స్ తమ రూపురేఖలు మార్చుకుని గుజరాత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాయ‌ని, యువత జీవితాల‌ను నాశనం చేసే అలాంటి వాటిని గుజ‌రాత్ అనుమ‌తించ‌బోద‌ని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి బల్క్ డ్రగ్స్ పార్క్‌కు ప్ర‌ధాని సోమవారం శంకుస్థాపన చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు మూడు రోజుల కస్టడీ..

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. "అర్బన్ నక్సల్స్ కొత్త రూపాలతో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమ వేషధారణలను మార్చుకున్నారు. వారు మన అమాయక, శక్తివంతమైన యువతను తమను అనుసరించేలా తప్పుదారి పట్టిస్తున్నారు ’’ అని ఈ ఏడాది చివరిలో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని ఉద్దేశించి ప్ర‌ధాని పరోక్షంగా దాడి చేశారు.

80 శాతం ముస్లింలు ఓబీసీ కోటాను అనుభవిస్తున్నారు - రాందాస్ అథవాలే

‘‘ అర్బన్ నక్సల్స్ పై నుంచి కాలు మోపుతున్నారు. మా యువ తరాన్ని నాశనం చేయడానికి మేము వారిని అనుమతించము. దేశాన్ని నాశనం చేసే పనిని చేపట్టిన అర్బన్ నక్సల్స్ కు వ్యతిరేకంగా మన పిల్లలను మనం హెచ్చరించాలి. వీరు విదేశీ శక్తుల ఏజెంట్లు. వారికి వ్యతిరేకంగా గుజరాత్ తల వంచదు, గుజరాత్ వాటిని నాశనం చేస్తుంది ’’ అని ప్రధాని మోడీ అన్నారు.

కడుపులో ఐదేళ్ల నుంచి కత్తెర.. డెలివరీ చేసిన వైద్యుల నిర్లక్ష్యం.. మళ్లీ అదే హాస్పిటల్‌కు బాధితురాలు

2014లో తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచిందని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని మోడీ అన్నారు.
 

click me!