ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు మూడు రోజుల కస్టడీ..

By Sumanth KanukulaFirst Published Oct 10, 2022, 1:47 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారులు అభిషేక్‌ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారులు అభిషేక్‌ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. దీంతో సీబీఐ కోర్టు అతనికి మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు. మూడు రోజుల పాటు అభిషేక్‌ను విచారించనున్నారు. 

ఇక,  ఢిల్లీకి చెందిన జీఎన్‌సీడీటీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్న అభిషేక్ బోయిన్‌పల్లిని ఆదివారం విచారణకు పిలిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్టుగా సీబీఐ గుర్తించిందని.. దీంతో గత రాత్రి అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐకి ఇది రెండో అరెస్ట్. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్టు చేసింది.

ఇక, అభిషేక్ తెలంగాణలోని ఓ అగ్ర రాజకీయ నేతకు సన్నిహితుడనే ప్రచారం ఉంది. రాబిన్ డిస్టిలరీస్ ఎల్‌ఎల్‌పీలో అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు అభిషేక్ బోయిన్‌పల్లి కూడా డైరెక్టర్. అరుణ్ పిళ్లై, అభిషేక్  2022 జూలై 12, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీని స్థాపించారు. ఇది హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో నమోదు చేయబడింది. సికింద్రాబాద్‌లోని సరోజినీ దేవి రోడ్‌లోని నవకేతన్ కాంప్లెక్స్‌లోని రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి చిరునామా ఉంది. అయితే అనూస్ బ్యూటీ పార్లర్ అనే బ్యూటీ సెలూన్ అడ్రస్ అదే. ఇక, అరుణ్ రామచంద్ర పిళ్లై మరో నిందితుడు, ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు వసూలు చేసి ఇతర నిందితులకు బదిలీ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 

click me!