గుజరాత్‌లో కుప్పకూలిన మోర్బి బ్రిడ్జి: ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 31, 2022, 5:57 PM IST
Highlights

గుజరాత్ మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనలో ఒరెవాకు గ్రూపునకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనలో మొత్తం 141 మంది మృతి  చెందారు. 
 

గాంధీనగర్:గుజరాత్ రాష్ట్రంలోని మోర్బి బ్రిడ్జి  కూలిన ఘటనలో ఒరెవాకు గ్రూపునకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వంతెన మరమ్మత్తులు చేసే బాధ్యతలను ఈ కంపెనీ నిర్వహించింది.

వంతెన కుప్పకూలడంతో మొత్తం 141 మంది మృతి చెందారు. మృతుల్లో 56 మంది చిన్నారులున్నారు.ఐపీసీ 304,306,114  సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టుగా గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని విచారించనున్నారు. ఈ ఘటనపై విచారణను సిట్ చేయనుంది. 

ఎన్‌డీఆర్ఎఫ్ కి  చెందిన ఐదు బృందాలు ,స్టేట్ డిజాస్టర్ సోర్స్ కు చెందిన ఆరు ప్లాటూన్లు ,ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక టీమ్,ఆర్మీ,ఇండియన్  నేవీకి  చెందిన రెండుటీమ్ లు  రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టాయి.ఈ ప్రమాదంలో మరణించినకుటుంబాలకు రూ.4 లక్షలను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు.

alsoread:మోర్బీ వంతెన ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. ప్రధానిని టార్గెట్ చేస్తూ పాత వీడియోలు షేర్ చేస్తున్న నాయకులు

ఈ బ్రిడ్జి కెపాసిటీ 125 మంది మాత్రమేనని ఒరెవా సంస్థ తెలిపింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి అనుమతినిచ్చారని ఆ  సంస్థ వెల్లడించింది.రూ.2  కోట్లతో  బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేపట్టినట్టుగా ఆ సంస్థ వివరింంచింది.

 


 

click me!