PM Modi degree row: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు. క్రిమినల్, పరువు నష్టం కేసులో ఇరువురు నేతలపై జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
PM Modi degree row: ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధమని సవాల్ చేశారు. కానీ, ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు. క్రిమినల్, పరువు నష్టం కేసులో ఇరువురు నేతల అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అహ్మదాబాద్ కోర్టు పిలిచినప్పుడు హాజరుకావలసి ఉంటుంది.
ప్రధాని మోదీ డిగ్రీపై సంబంధించి గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా గుజరాత్ యూనివర్శిటీని అప్రతిష్టపాలు చేసేలా కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అవమానకరమైన ప్రకటనలు చేశారంటూ.. గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం దాఖలు చేసింది. ఈ కేసులో మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఏప్రిల్ 15 న కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖాలు చేశారు. అయితే, సెషన్స్ కోర్టు సమన్లను సమర్థించింది. ఆ తర్వాత వారు మధ్యంతర స్టే కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా దాన్ని కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.