Sonia Gandhi: సోనియా గాంధీ ఆస్తుల లెక్కలు ఇవే.. ఇటలీ ఇంటి షేర్ ఎన్ని లక్షలంటే?

By Mahesh K  |  First Published Feb 16, 2024, 7:24 PM IST

సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నిక కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన వద్ద మొత్తం రూ. 12.53 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వివరించారు. వాటితోపాటు బంగారు ఆభరణాలు, వెండి, తన పేరిట ఢిల్లీలో మూడు బిగాల సాగు భూమి ఉన్నట్టు తెలిపారు.
 


Sonia Gandhi: సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల వివరాలను నమోదు చేశారు. తన వద్ద రూ. 12.53 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. ఇటలీలో తన తండ్రి వారసత్వంగా రూ. 27 లక్షల షేర్ ఉన్నట్టు వివరించారు. వీటితోపాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, స్వర్ణ ఆభరణాలు ఉన్నట్టు వెల్లడించారు. న్యూఢిల్లీలోని దేరా మండి గ్రామంలో మూడు బిగాల సాగు భూమి ఆమె పేరిట ఉన్నట్టు తెలిపారు. ఆమె ఆదాయం ఎంపీగా పొందుతున్న జీతాన్ని, రాయల్టీ ఇన్‌కమ్, క్యాపిటల్ గెయిన్స్ వంటి వాటిని పేర్కొన్నారు. కాగా, తన వద్ద రూ. 90 వేల నగదు ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

2019లో ఆమె మొత్తం ఆస్తులు రూ. 11.82 కోట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Latest Videos

undefined

Also Read: Nitish Kumar: నితీశ్ కుమార్‌కు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లాలు ప్రసాద్.. జేడీయూ రియాక్షన్ ఇదే

సోనియా గాంధీ విద్యార్హతలు:

రాజ్యసభ ఎన్నిక కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాను మూడేళ్ల  ఫారీన్ లాంగ్వేజెస్(ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో) కోర్స్‌ను 1964లో సియెనాలోని ఇస్టిటుటో సాంటా తెరెసాలో పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. 1965లో ఆమె కేంబ్రిడ్జ్‌లోని లెన్నాక్స్ కుక్ స్కూల్‌లో ఇంగ్లీష్ కోర్స్ సర్టిఫికేట్ పూర్తి చేసినట్టు వివరించారు. 

సోనియా గాంధీకి వ్యక్తిగతంగా కారు లేదు. సోషల్ మీడియా ఖాతా కూడా లేదు.

click me!