గుజరాత్: రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న భూపేంద్ర పటేల్

By Siva KodatiFirst Published Sep 12, 2021, 9:23 PM IST
Highlights

గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు  గుజరాత్ రాష్ట్ర సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ను  ఎన్నుకొంది బీజేపీ శాసనసభాపక్షం

గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు  గుజరాత్ రాష్ట్ర సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ను  ఎన్నుకొంది బీజేపీ శాసనసభపక్ష సమావేశం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్  తోమర్ అధికారికంగా ప్రకటించారు. భూపేంద్ర పటేల్ సారథ్యంలోనే 2022 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దిగనుంది. విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గంపై ప్రజల్లోని వ్యతిరేకతను తప్పించుకోవడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషణలు వచ్చాయి.

గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌‌తో సాన్నిహిత్యమున్న పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఘట్లోడియా నియోజకవర్గంలో శశికాంత్ పటేల్‌పై 1.17లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గానికి అంతకు క్రితం ఆనందిబెన్ పటేల్ ప్రాతినిధ్యం వహించారు.

ALso Read:గుజరాత్ నూతన సీఎం భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?

పాటిదార్ ఆర్గనైజేషన్లు సర్దార్ ధామ్, విశ్వ ఉమియ ఫౌండేషన్‌‌లకు భూపేంద్ర పటేల్ ట్రస్టీగా ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 2015 నుంచి 2017 వరకు చైర్మన్‌గా ఉన్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా 1995, 1996లో కొనసాగారు. మేమ్‌నగర్ పాలికకు 1999 నుంచి 2000 వరకు ప్రెసిడెంట్‌గా, స్కూల్ బోర్డ్ ఆఫ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2008 నుంచి 2010 వరకు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తల్టేజ్ వార్డ్ నుంచి 2010 నుంచి 2015 వరకు కౌన్సిలర్‌గా ఉన్నారు.

click me!