కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 12, 2021, 07:18 PM IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

సారాంశం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport