బ్రేకింగ్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

Siva Kodati |  
Published : Sep 11, 2021, 03:16 PM ISTUpdated : Sep 11, 2021, 03:29 PM IST
బ్రేకింగ్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

సారాంశం

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. 2016 నుంచి ఆయన సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజీనామా లేఖను ఈ  సందర్భంగా గవర్నర్‌కు అందజేశారు విజయ్ రూపానీ. అయితే ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. 

ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే రాజీనామాకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే హైకమాండ్ ఆదేశాలతోనే ఆయన సీఎం కుర్చీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. 2016 ఆగస్టు 7న రూపానీ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu