Green India Challenge : మొక్కలు నాటిన గౌతమ్ గంభీర్.. త్వరలో ట్విట్టర్ వేదికగా ముగ్గురికి సవాల్..

Published : Sep 11, 2021, 02:17 PM ISTUpdated : Sep 11, 2021, 02:32 PM IST
Green India Challenge : మొక్కలు నాటిన గౌతమ్ గంభీర్.. త్వరలో ట్విట్టర్ వేదికగా ముగ్గురికి సవాల్..

సారాంశం

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని గంభీర్ కోరారు. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

అంతర్జాతీయ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్ లో మొక్కలు నాటారు. కార్యక్రమం అనంతరం గౌతమ్ గంభీర్ కు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని గంభీర్ కోరారు. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

మృత్యువుతో పోరాడి ఓడిన ముంబయి ‘నిర్భయ’.. హాస్పిటల్‌లో తుదిశ్వాస

ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని గంభీర్ తెలిపారు. త్వరలోనే ట్విట్టర్ వేదికగా ముగ్గురికి సవాల్ విసురుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటాలని, వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని గంభీర్ చెప్పాడు. తాను ట్విట్టర్‌లో మరో ముగ్గురు వ్యక్తులకు ఛాలెంజ్ విసురుతానని కూడా చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word