చిన్నారి ఎదుటే స్విమ్మింగ్‌పూల్‌లో మహిళా కానిస్టేబుల్‌తో రాసలీలలు.. డీఎస్పీ అరెస్ట్

Siva Kodati |  
Published : Sep 11, 2021, 02:58 PM IST
చిన్నారి ఎదుటే స్విమ్మింగ్‌పూల్‌లో మహిళా కానిస్టేబుల్‌తో రాసలీలలు.. డీఎస్పీ అరెస్ట్

సారాంశం

ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

విధి నిర్వహణలో బాధ్యతగా  వుంటూ.. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారులే వారి చర్యలతో విమర్శలకు గురవుతున్నారు. తాజాగా చిన్నారి ముందు మహిళా కానిస్టేబుల్‌తో సరసాలాడిన రాజస్థాన్‌కు చెందిన డీఎస్పీ హీరాలాల్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వారితో పాటు మహిళ కుమార్తెగా చెబుతున్న చిన్నారి కూడా ఉంది. డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్ ఇద్దరినీ ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ అరెస్ట్‌ను ఏడీజీ అశోక్ రాథోడ్ ధ్రువీకరించారు. రాజస్థాన్ పోలీస్ చీఫ్ మోహన్‌లాల్ లాథర్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !