78 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు,వీటికి లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత: కేంద్రం

By narsimha lode  |  First Published Apr 23, 2020, 4:59 PM IST

దేశంలోని 78 జిల్లాల్లో దాదాపుగా 14 రోజుల నుండి కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది. 
 



న్యూఢిల్లీ: దేశంలోని 78 జిల్లాల్లో దాదాపుగా 14 రోజుల నుండి కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది. 

గురువారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఇందులో ఇవాళ్టికి 28 రోజుల కంటే అంతకంటే ఎక్కువ రోజులుగా ఒక్క కేసులు కూడ నమోదు కాని జిల్లాలు 12 ఉన్నాయని ఆయన తెలిపారు.

Latest Videos

also read:కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్‌లో కుటుంబం బహిష్కరణ, విచారణకు ఆదేశం

గత 24 గంటల్లో 1409 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో  గురువారం నాడు ఉదయానికి 21.393కి చేరుకొన్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది మార్చి 23 న 14,925 పరీక్షలు నిర్వహిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 22న ఐదు లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు.30 రోజుల్లో కరోనా పరీక్షల నిర్వహణ 33 శాతం పెరిగినట్టుగా కేంద్రం తెలిపింది. 

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 21,393 కేసులు నమోదయ్యాయి. 16,454 యాక్టివ్ కేసులుగా ఉన్నాయన్నారు. 4,257 మంది కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్టుగా కేంద్రం తెలిపింది.కరోనా నుండి కోలుకొంటున్న వారి సంఖ్య 19.89 శాతంగా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. దేశంలో కరోనా వైరస్ కేసులు రెట్టింపు కావడాన్ని తగ్గించినట్టుగా పర్యావరణ సెక్రటరీ సీకే మిశ్రా చెప్పారు.

లాక్‌డౌన్ ఆంక్షల మినహయింపు

స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, పిండి మిల్లులు, రోడ్ల నిర్మాణ పనులకు, మొబైల్ రీ చార్జీ దుకాణాలకు  లాక్ డౌన్ ఆంక్షల నుండి మినహయింపు ఇస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది.సిమెంట్ విక్రయాలు దుకాణాలు, పుస్తకాల దుకాణాలు వంటి దుకాణాలకు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు. హాట్ స్పాట్స్  ప్రాంతాల్లో ఈ మినహాయింపులు వర్తించవని కేంద్రం స్పష్టం చేసిింది. హాట్ స్పాట్స్ కాని ప్రాంతాల్లోనే ఈ మినహాయింపులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. 

 

click me!