కరోనా ఎఫెక్ట్: పెంచిన డిఏ చెల్లింపు నిలిపివేత

By narsimha lodeFirst Published Apr 23, 2020, 3:00 PM IST
Highlights

కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. డిఏను 4 శాతం నుండి 12 శాతానికి పెంచింది.  ఈ మేరకు మార్చి 13వ తేదీ నుండి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది.
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. డిఏను 4 శాతం నుండి 12 శాతానికి పెంచింది.  ఈ మేరకు మార్చి 13వ తేదీ నుండి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

డిఏ ను 4 నుండి 12 శాతానికి పెంచడం ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సుమారు 27 వేల కోట్ల భారం పడనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పెంచిన డిఎను చెల్లింపును కేంద్రం నిలిపివేసింది.2020 జనవరి 1 నుంచి  2021 జూలై వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

also read:యోగా, ప్రాణాయామంతో కరోనాను ఎదుర్కొన్నా: వైరల్‌గా మారిన ఢిల్లీ వాసి వీడియో

ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష  జూలైలో ఉండనుంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. నిధుల కొరత కారణంగా  ఖర్చులను తగ్గించుకొంటుంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్ లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకొంది. రెండేళ్ల పాటు ఎంపీ నిధుల్లో కూడ కోత విధించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఒక్క రోజు వేతనాన్ని కూడ కోత విధించింది.

click me!