Maharashtra news : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

Published : Nov 12, 2019, 01:45 PM ISTUpdated : Nov 12, 2019, 06:31 PM IST
Maharashtra news  : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

సారాంశం

హారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ సిపారసు చేస్తే మంగళవారం నాడు కేంద్రానికి లేఖ పంపారు. 


ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ సిపారసు చేస్తే మంగళవారం నాడు కేంద్రానికి లేఖ పంపారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్సీపీకి మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరక  గవర్నర్ సమయం ఇచ్చారు.

మహారాష్ట్రలో ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి కూడ పూర్తి స్థాయి సంఖ్యలో బలం లేదు. అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకొన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించేందుకు వీలుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రెండు రోజుల క్రితం బీజేపీని ఆహ్వానించారు.

Also Read:మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా

ఎన్నికల ముందు బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే సీఎం పదవి విషయంలో 50:50 ఫార్మూలాను పాటించాలని శివసేన బీజేపీ నాయకత్వం ముందు ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు..దీంతో శివసేన కూడ తన పట్టును వీడలేదు. దీంతో గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేతలు గవర్నర్ తో సమావేశమై ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు చెప్పారు. 

Also Read:‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

దీంతో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లను కైవసం చేసుకొన్న పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించారు. కానీ, శివసేన కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీకి గవర్నర్ సోమవారం నాడు రాత్రి ఆహ్వానించారు.

మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై నిర్ణయాన్ని చెప్పాలని ఎన్సీపీకి గవర్నర్  కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను ఎన్సీపీ ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎన్సీపీ సంప్రదింపులు జరుపుతోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మంగళవారం నాడు మధ్యాహ్నం ముంబైకు చేరుకొంటున్నారు.ఈ తరుణంలో  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నాడు సిఫారసు చేశారు.

also read:కమల్ హాసన్ తో విభేదాలు: హీరో విజయ్ కు ప్రశాంత్ కిశోర్ గాలం?

ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు మద్యాహ్నం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కేబినెట్ సమావేశంలో  మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది

ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు రెండు రోజుల పాటు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. కానీ, గవర్నర్ గడువు ఇవ్వలేదు. దీంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్సీపీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !